MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Telangana
  • పేమెంట్ అయిన‌ట్లు సౌండ్ వ‌స్తుంది కానీ డ‌బ్బులు ప‌డ‌వు.. ఫోన్‌పేలో కొత్త స్కామ్‌. జాగ్ర‌త్త‌!

పేమెంట్ అయిన‌ట్లు సౌండ్ వ‌స్తుంది కానీ డ‌బ్బులు ప‌డ‌వు.. ఫోన్‌పేలో కొత్త స్కామ్‌. జాగ్ర‌త్త‌!

Phonepe Scam: మారిన టెక్నాల‌జీతో పాటు నేరాలు కూడా మారుతున్నాయి. తాజాగా వెలుగులోకి ఫోన్‌పే పేరుతో చేస్తున్న కొత్త మోసం వెలుగులోకి వ‌చ్చింది. ఇంత‌కీ ఏంటీ స్కామ్‌.? ఎలా గుర్తించాలి.? లాంటి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 01 2026, 02:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నకిలీ ఫోన్ పే యాప్‌తో కొత్త మోసం
Image Credit : Gemini AI

నకిలీ ఫోన్ పే యాప్‌తో కొత్త మోసం

ఆన్‌లైన్ చెల్లింపులు చేసే దుకాణాలను లక్ష్యంగా చేసుకుని ఇద్దరు యువకులు ప్రత్యేకంగా తయారు చేసిన నకిలీ యాప్‌ను ఉపయోగించారు. ఈ యాప్‌లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చెల్లింపు జరిగినట్లు చూపించడంతో పాటు బీప్ శబ్దం కూడా వినిపిస్తుంది. దుకాణదారులు బిజీగా ఉండే సమయంలో ఈ పద్ధతిని ఉపయోగించి డబ్బులు పంపినట్లు చూపించి సరుకులు తీసుకెళ్తున్నారు. కానీ వాస్తవానికి వ్యాపారి అకౌంట్‌లో ఎలాంటి మొత్తం జమ కావడం లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఈజీ మ‌నీ కోసం
Image Credit : Social Media

ఈజీ మ‌నీ కోసం

ఏపీ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన గోపి కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్ జగ్గయ్యపేటలో నివసిస్తున్నాడు. ఇద్దరూ కలిసి సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుని నకిలీ ఫోన్ పే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. తర్వాత దుకాణాలను గుర్తించి వరుసగా మోసాలకు పాల్పడ్డారు.

Related Articles

Related image1
వచ్చే నెల రోజులు చాలా ప్రమాదకరం. ప్రతీ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యంగా ఈ రాశుల వారు
Related image2
Flour Price: కిలో గోధుమ‌ పిండి ధ‌ర రూ. 200... చుక్క‌లు చూపిస్తోన్న ద్ర‌వ్యోల్బణం
35
బిజీ దుకాణాలే ప్రధాన లక్ష్యం
Image Credit : Getty

బిజీ దుకాణాలే ప్రధాన లక్ష్యం

ఈ మోసగాళ్లు ముందుగా రద్దీగా ఉండే కిరాణా షాపులు, జనసంచారం ఎక్కువగా ఉండే దుకాణాలను గుర్తించేవారు. ఆ తర్వాత అక్కడ పెద్ద మొత్తంలో సరుకులు కొనుగోలు చేసేవారు. నకిలీ యాప్‌తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసినట్లు చూపించేవారు. బీప్ శబ్దం రావడంతో వ్యాపారులు డబ్బులు వచ్చాయని భావించి సరుకులు ఇచ్చేవారు. తీసుకువచ్చిన సరుకులను తక్కువ ధరకు అమ్మి నగదు సంపాదించేవారు.

45
కిరాణా వ్యాపారి ఫిర్యాదుతో వెలుగులోకి
Image Credit : Getty

కిరాణా వ్యాపారి ఫిర్యాదుతో వెలుగులోకి

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి ప్రాంతంలోని ఒక కిరాణా దుకాణంలో సుమారు రూ.25 వేల విలువైన సరుకులు కొనుగోలు చేసి నకిలీ యాప్‌తో చెల్లింపు చేసినట్లు చూపించారు. మొదట బీప్ శబ్దం రావడంతో డబ్బులు వచ్చాయని భావించిన వ్యాపారి తర్వాత అకౌంట్ చెక్ చేయగా నగదు జమ కాలేదని గుర్తించాడు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

55
వాహన తనిఖీల్లో ముఠా అరెస్ట్
Image Credit : X/Telangana Police

వాహన తనిఖీల్లో ముఠా అరెస్ట్

పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీలలో నంబర్ ప్లేట్ కనిపించకుండా స్టిక్కర్ వేసిన కారును ఆపి తనిఖీ చేశారు. కారులో ఉన్న ఇద్దరిని విచారించగా నకిలీ ఫోన్ పే యాప్‌తో మోసాలు చేస్తున్నట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి రూ.1.26 లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పలు పట్టణాలు, గ్రామాల్లో ఇదే పద్ధతితో మోసాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. డిజిటల్ చెల్లింపులు స్వీకరించే వ్యాపారులు తప్పనిసరిగా తమ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు జమ అయ్యాయా లేదా అనేది చూసి మాత్రమే సరుకులు ఇవ్వాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
నేరాలు, మోసాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
కొండా ఫ్యామిలీ వర్సెస్ రేవంత్ రెడ్డి.. తెలంగాణ పాలిటిక్స్‌లో అస‌లేం జరుగుతోంది.?
Recommended image2
ఆగ‌స్టు 21న స్కూళ్ల‌కు సెల‌వు.. ప్రిన్సిప‌ల్ హ‌త్య‌ను ఖండిస్తూ. అస‌లేం జ‌రిగిందంటే.?
Recommended image3
Now Playing
Telangana rain alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్ దూసుకొస్తున్న అల్పపీడనం | Asianet News Telugu
Related Stories
Recommended image1
వచ్చే నెల రోజులు చాలా ప్రమాదకరం. ప్రతీ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యంగా ఈ రాశుల వారు
Recommended image2
Flour Price: కిలో గోధుమ‌ పిండి ధ‌ర రూ. 200... చుక్క‌లు చూపిస్తోన్న ద్ర‌వ్యోల్బణం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved