Asianet News TeluguAsianet News Telugu

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై కమిషన్: 6 నెలల గడువు పెంచిన సుప్రీంకోర్టు

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ కు మరో ఆరు మాసాల గడువును పెంచుతూ శుక్రవారం నాడు సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

Supreme court extends time by six months for inquiry panel to conclude probe
Author
Hyderabad, First Published Jul 24, 2020, 1:18 PM IST


హైదరాబాద్: దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ కు మరో ఆరు మాసాల గడువును పెంచుతూ శుక్రవారం నాడు సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

కరోనా కారణంగా విచారణ పూర్తి చేయలేకపోయామని గడువును పెంచాలని కమిషన్ ఈ నెల 22వ తేదీన సుప్రీంకోర్టుులో ధరఖాస్తు చేసింది. ఈ మేరకు న్యాయవాది సుప్రీం కోర్టులో పరమేశ్వర్ ధరఖాస్తు చేసుకొన్నారు. 

ఈ ధరఖాస్తుపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ కమిషన్ కు మరో ఆరు మాసాల పాటు గడువును పెంచుతూ సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. 

దేశ వ్యాప్తంగా  దిశపై రేప్ అత్యాచారం సంచలనం సృష్టించింది. దిశపై గత ఏడాది నవంబర్ 27వ తేదీన రాత్రి నలుగురు నిందితులు రేప్ చేసి ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. ఈ కేసులో నిందితులను గత 2019 డిసెంబర్ 6వ తేదీన షాద్‌నగర్ సమీపంలో పోలీసుల ఎన్‌కౌంటర్ లో నలుగురు నిందితులు మరణించారు.

also read:దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై కమిషన్: గడువు పెంపుకు సుప్రీంలో ధరఖాస్తు

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై 2019 డిసెంబర్ 12వ తేదీన ముగ్గురు సభ్యులతో  కమిషన్ ను ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు.

సుప్రీంకోర్టు మాజీ జడ్డి వీఎస్ సిర్పూర్ కర్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటైంది.విచారణ కమిషన్ లో ముంబై హైకోర్టు మాజీ న్యాయమూర్తి రేఖా ప్రకాశ్, మాజీ సీబీఐ డైరెక్టర్ కార్తికేయన్ ఉన్నారు. 

త్రిసభ్య కమిషన్ కు సీఆర్ పీఎఫ్ భద్రత కల్పించారు. కమిషన్ ఖర్చులను తెలంగాణ ప్రభుత్వమే భరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆరు మాసాల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్ ను కోరింది.

కమిషన్ సభ్యులు గతంలో రాష్ట్రంలో పర్యటించి ఈ ఎన్ కౌంటర్ పై వివరాలను సేకరించారు. ఇదే సమయంలో దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. దీంతో విచారణ ముందుకు సాగలేదు. దీంతో మరో ఆరు మాసాల పాటు గడువును పొడిగించాలని న్యాయవాది పరమేశ్వరన్ సుప్రీంకోర్టులో ధరఖాస్తు చేశాడు

Follow Us:
Download App:
  • android
  • ios