MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
• Home
• Entertainment
• 'మేకప్ రూమ్‌లో బంధించి,వేధించాడు,బట్టలు కట్టుకుంటూంటే దారుణంగా..': నిర్మాత పై 'సీరియల్ హీరోయిన్ ' కంప్లైంట్

'మేకప్ రూమ్‌లో బంధించి,వేధించాడు,బట్టలు కట్టుకుంటూంటే దారుణంగా..': నిర్మాత పై 'సీరియల్ హీరోయిన్ ' కంప్లైంట్

నేను బట్టలు మార్చుకునేటప్పుడు వారు నా మేకప్ గది తలుపు పగలగొడతారు. తలుపులు బ్రద్దలు కొట్టుకుని లోపలకి వచ్చేస్తారేమో అనిపించింది.

4 Min read
Author : Surya Prakash
Published : Apr 27 2024, 09:47 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
114

సినీ,టీవీ పరిశ్రమ రంగం ఇంతగా అభివృధ్ది చెందినా, మీడియా తో అందరూ ఇంటరాక్ట్ అవుతున్నా కొన్ని దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని బయటకు వస్తున్నాయి., మరికొన్ని భయాలతో అక్కడికక్కడే సమాధి అయ్యిపోతున్నాయి. వేధింపులుకు తట్టుకోలేని కొందరు సోషల్ మీడియా ద్వారా బయిటకు వస్తున్నారు. అలా తాజాగా తానను మేకప్ రూమ్‌లో బంధించి వేధించారంటూ ఓ పాపులర్ టీవీ సీరియల్ నటి చేసిన కామెంట్స్ ఇప్పుడు టీవీ మీడియాని కుదిపేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214

Krishnamukherjee

Krishnamukherjee

పాపులర్ టెలివిజన్ నటి కృష్ణ ముఖర్జీ అంటే టీవి సీరియల్స్ చూసే ప్రతీ ఒక్కరికీ ఇష్టమే. ముఖ్యంగా  యే హై మొహబ్బతీన్ లో ఆమె నటన చూసి ఫిదా అయ్యిపోయారు. ఆ సీరియల్ జనాలకు తెగ నచ్చేసింది. దాదాపు పదేళ్లుగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఆమె వరస పెట్టి షోలు, సీరియల్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. ఆమెకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

314

Krishnamukherjee

Krishnamukherjee

నాగిన్ 3 ,కుచ్ తో హై , నాగిన్ ఏక్ నయా రంగ్ మే, శుభ్ సౌగన్ వంటి షోలు, సీరియల్స్ కృష్ణ ముఖర్జికి విపరీతమైన పేరు తెచ్చిపెట్టాయి. ఓ రకంగా టీవి ఇండస్ట్రీలో ఆమె సెలబ్రెటీ హోదాను అనుభవిస్తోంది. అయితే ఆ స్దాయి నటికు కూడా వేధింపులు ఉంటాయని అంటే ఎవరు నమ్మలేరు. కానీ ఆమే స్వయంగా తన ఇనిస్ట్రగ్రమ్ ఎక్కౌంట్ లో తనను నిర్మాత వేధిస్తున్నాడని వాపోతూ పోస్ట్ పెట్టడం షాక్ ఇచ్చింది.

414

Krishnamukherjee

Krishnamukherjee

కృష్ణ ముఖర్జీ తన ఇనిస్ట్రగ్రమ్ ఎక్కౌంట్ లో ఏప్రియల్ 26, 2024 న పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ లో ఆమె  దాదాపు ఏడాదిన్నరగా ఏ విధంగా ఇబ్బందులు పడుతోంది చెప్పుకొచ్చింది. ఇంతకాలం ఈ ఇష్యూ మీద మాట్లాడటానికి ధైర్యం చాలలేదని, తాను సర్దుపోదామనుకున్నా కుదరలేదని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు తాను ఎలాంటి సిట్యువేషన్ అయినా ఎదుర్కోవాలని ఫిక్స్ అయ్యినట్లు చెప్పింది.

514

Krishnamukherjee

Krishnamukherjee

శుభ్ షోగన్ నిర్మాత కుందన్ సింగ్ ని ట్యాగ్చేస్తూ ఆమె ఈ పోస్ట్ పెట్టింది. ఆ ప్రొడక్షన్ హౌస్ వారు, నిర్మాత తనని చాలా టార్చర్ పెట్టారని, లిటరల్ గా హెరాస్ చేసారని చెప్పుకొచ్చింది. ఆ వేధింపులు చెప్పుకోలేని విధంగా ఉన్నాయని, తట్టుకోలేకే ఇలా ధైర్యంగా సోషల్ మీడియా ద్వారా బయిటపెట్టాల్సి వచ్చిందని అంది.

614

Krishnamukherjee

Krishnamukherjee

స్టార్ ప్లస్' పాపులర్ షో 'యే హై మొహబ్బతే'తో అరంగేట్రం చేసిన తాను ఎప్పుడూ ఇంత ఇబ్బంది పడలేదని, దంగల్ టీవీ లో ప్రసారం అవుతున్న  'శుభ్ షగున్' కే తనకు వేధింపులు ఎదురయ్యాయని అంది. ఆ షోలో షెహజాదా ధామీ సరసన కనిపించింది.  ఈ క్రమంలో  కృష్ణ  ముఖర్జీ   తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో  శుభ్ షాగున్ నిర్మాత గురించి షాకింగ్ రివీల్ చేసారు. నిర్మాత కారణంగా తాను గత కొన్ని నెలలుగా డిప్రెషన్‌తో, ఆందోళనకు గురవుతున్నానని, షో సెట్స్‌లో తనను వేధించారని వెల్లడించింది.

714

Krishnamukherjee

Krishnamukherjee

ఆమె మాట్లాడుతూ...తనకు అనారోగ్యంగా ఉన్నానని,షూటింగ్ చేయలేనని చెప్పటంతో తనను  మేకప్ గది లోపల లాక్ చేసారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆ సంస్ద తనకు  గత 5 నెలలుగా తన బకాయిలు క్లియర్  చేయలేదని పేర్కొంది. నిర్మాత నుండి బెదిరింపులు వస్తున్నాయని కృష్ణ కూడా వెల్లడించాడు మరియు ఆమె మాట్లాడటానికి భయపడిందని పేర్కొంది. తాను సేఫ్ గా లేనని, అందుకే ఏ షోకు వెళ్లలేకపోతునన్నానని, ఆ నిర్మాత నుంచి రక్షణ కోరుతున్నట్లుగా ఆమె ఆవేదనతో చెప్పింది.

814

Krishnamukherjee

Krishnamukherjee

ఆ షో టీమ్ ...నేను బట్టలు మార్చుకునేటప్పుడు వారు నా మేకప్ గది తలుపు పగలగొడతారు. తలుపులు బ్రద్దలు కొట్టుకుని లోపలకి వచ్చేస్తారేమో అనిపించింది.  అదెంత దారుణంగా ఉంటుందో ఊహించండి. వారు 5 నెలలుగా పేమెంట్స్ లేవు.   అది నిజంగా పెద్ద మొత్తం. నేను ప్రొడక్షన్ హౌస్ , దంగల్ ఆఫీస్‌కి వెళ్ళాను కానీ వాళ్లు నన్ను ఎప్పుడూ పట్టించుకోలేదు.

914

Krishnamukherjee

Krishnamukherjee

నాకు ఇంతలా మాట్లాడే ధైర్యం నాకు ఎప్పుడూ లేదు, కానీ ఈ రోజు నేను దానిని వెనక్కి తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. నేను కష్టమైన పరిస్దితులను ఎదుర్కొంటున్నాను మరియు గత ఒకటిన్నర సంవత్సరం నాకు చుక్కలు చూపించింది. ఈ విషయమై నేను చాలా మంది ని సాయం చేయమని అడిగాను కానీ ఏమీ ఫలితం లేదు. దాని గురించి ఎవరూ ఏమీ చేయలేకపోయారు.

1014

Krishnamukherjee

Krishnamukherjee

నేను ఒంటరిగా ఉన్నప్పుడు డిప్రెషన్ కు  లోనయ్యాను, గుండెలవిసేలా ఏడ్చాను. దంగల్ టీవీ కోసం నా చివరి షో" శుభ్ షగున్" చేయడం ప్రారంభించినప్పుడు ఇదంతా ప్రారంభమైంది. "అది నా  జీవితంలో అత్యంత చెత్త నిర్ణయం. నేనెప్పుడూ అలా చేయాలనుకోలేదు కానీ ఇతరుల మాటలు విని ఒప్పందంపై సంతకం చేశాను అంది.

1114

Krishnamukherjee

Krishnamukherjee

ఇది రాస్తున్న సమయంలో నా చేతులు వణుకుతున్నాయి. నేను ఏంగ్జైటీ, డిప్రెషన్ తో పోరాడుతున్నాను. సోషల్ మీడియాలో సాధారణంగా మన ఎమోషన్స్ ని దాచి, మన బ్రైటర్ సైడ్ ని చూపెడుతున్నాము. కానీ ఇదీ అసలైన నిజం . నా కుటుంబం నన్ను ఇలాంటివి పోస్ట్ చేయద్దని చెప్తున్నారు.  వాళ్లు నిన్ను ఏదైనా చేస్తే ఏంటి పరిస్దితి అని భయపడుతున్నారు. కానీ నేను ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి. నాకు న్యాయం కావాలి. ఇది నా హక్కు అంది.

1214

Krishnamukherjee

Krishnamukherjee

నేను బయిటకు వెళ్లినప్పుడు నేను ఎందుకు ఏ షో చేయడం లేదని ప్రజలు నన్ను అడుగుతారు?. ఇదీ కారణం. అర్దం చేసుకోండి. మళ్లీ అదే సంఘటనలు రిపీట్ అవుతాయేమో అని నాకు భయంగా ఉంది?? నాకు న్యాయం కావాలి." ఆమె రాసుకొచ్చిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె అభిమానులు రెస్పాండ్ అవుతున్నారు.

1314

కృష్ణ ముఖర్జీ  ఈ పోస్ట్‌ను ఇనిస్ట్రాలో పెట్టిన  వెంటనే, ఆమె స్నేహితులు మరియు తోటి నటీనటులు తమ సపోర్ట్  అందించారు. ఆ నిర్మాత  ముంబైకి తిరిగి వచ్చినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉండమని చెప్పారు.  టీవి రంగానికి చెందిన శ్రద్ధా ఆర్య, నీనా కులకర్ణి, షిరీన్ మీర్జా మరియు ఇతరులు కూడా నిర్మాతపై పోరాడేందుకు తమ సపోర్ట్ ని అందించారు.

1414
Krishna Mukherjee

Krishna Mukherjee

నాగిన్ మరియు కుచ్ తో హై చిత్రాలలో కూడా కనిపించిన కృష్ణ ముఖర్జీ గత సంవత్సరం మార్చిలో బ్యూటీ చిరాగ్ బట్లీవాలాను వివాహం చేసుకున్నారు. ఈ వివాదం తర్వాత ఆమె షోలకు గ్యాప్ ఇస్తుందని చెప్తున్నారు. అయితే ఆమె కొత్తగా ఏ సీరియల్ కమిటవ్వలేదని వినికిడి. అలాగే ఈ వివాదంపై ఇంకా ప్రొడ్యూసర్ ఏమీ స్పందించలేదు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Recommended image2
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Recommended image3
Vijay Sethupathi: బిగ్ బాస్‌లో విజయ్ సేతుపతి కామెంట్ల దుమారం.. సీఎం విజయ్‌ను టార్గెట్ చేశాడా? విజయ్ టీవీ క్లారిటీ
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved