అధికారిక లాంఛనాలతో జైపాల్ రెడ్డి అంత్యక్రియలు, కేసీఆర్ ఆదేశాలు
అనారోగ్యంతో మరణించిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.జైపాల్ రెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
అనారోగ్యంతో మరణించిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.జైపాల్ రెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే. జోషీని కేసీఆర్ ఆదేశించారు.
సోమవారం ఉదయం 11 గంటలకు జైపాల్ రెడ్డి పార్థీవ దేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం గాంధీభవన్‌లో ఉంచుతారు. అనంతరం మధ్యాహ్నం ర్యాలీగా నెక్లెస్‌రోడ్‌కు చేరుకుని పీవీ ఘాట్ పక్కన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
గత కొద్దికాలంగా న్యూమోనియాతో బాధపడుతున్న జైపాల్ రెడ్డి తీవ్ర జ్వరంతో ఇటీవల గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున జైపాల్ రెడ్డి తుదిశ్వాస విడిచారు.
కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కన్నుమూత
జైపాల్ రెడ్డి అస్తమయం: ఆ కల తీరకుండానే
సిఎం పదవిని తిరస్కరించిన జైపాల్ రెడ్డి: ఎందుకంటే...
కారణమిదే: తండ్రిని ఎదిరించిన జైపాల్ రెడ్డి
జైపాల్‌రెడ్డి సలహా విని ఓడిపోయిన ఎన్టీఆర్
ఎమర్జెన్సీని విధించిన ఇందిరాగాంధీపై పోటీ చేసి...
జైపాల్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
తెలంగాణ ఉద్యమం: జాతీయవాదిగా ప్రకటించుకొన్న జైపాల్ రెడ్డి
ఆయన సేవలు చిరస్మరణీయం: జైపాల్ మృతిపై రాహుల్ సంతాపం
మంచి మిత్రుడిని కోల్పోయా: జైపాల్‌రెడ్డికి నివాళులర్పించిన వెంకయ్య
జైపాల్ రెడ్డి గురించి ప్రముఖులు ఏమన్నారంటే...!!
అధికారిక లాంఛనాలతో జైపాల్ రెడ్డి అంత్యక్రియలు, కేసీఆర్ ఆదేశాలు