ఎన్టీఆర్.. తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు.. వెండితెర వేల్పుగా.. ప్రజా నాయకుడిగా చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి.. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి..దశాబ్ధాల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ కోటను ఏపీలో బద్ధలు కొట్టారు.

అలాంటి ఎన్టీఆర్‌ సైతం ఒకానొక దశలో ఓటమి పాలైన సంగతి తెలుగువారందరికీ తెలుసు. 1989 డిసెంబర్ 3న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా హిందూపురంతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి కూడా పోటీ చేశారు.

ఈ ఎన్నికల్లో హిందూపురం నుంచి గెలిచిన రామారావు.. కల్వకుర్తిలో మాత్రం ఓటమి పాలయ్యారు. అయితే ఏపీలోని అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించేలా ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన ఎన్టీఆర్.... అచ్చొచ్చిన హిందూపురంను ఎంచుకోగా.... తెలంగాణలో ఏ ప్రాంతం నుంచి పోటీ చేయాలనే సమస్య వచ్చింది.

ఈ క్రమంలో నాటి జనతాదళ్ నేతగా ఉన్న జైపాల్ రెడ్డి సూచన మేరకు కల్వకుర్తి నుంచి పోటీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత పైగా నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్‌గా ఉన్న రామారావుపై కాంగ్రెస్ నుంచి ఎవరిని పోటీకి దించాలని నాటి పీసీసీ పెద్దల్లో పెద్ద చర్చ జరిగింది.

దీంతో అప్పటికి ఒకసారి మాత్రమే గెలిచిన అనుభవమున్న జక్కుల చిత్తరంజన్‌దాస్‌కు టికెట్ కేటాయించారు. ఎన్టీఆర్ పోటీకి దిగడంతో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ స్వయంగా కల్వకుర్తిలో ప్రచారం చేశారు.

ఈ ఎన్నికల్లో తన చెప్పును నిలబెట్టినా జనాలు గెలిపిస్తారంటూ అన్నగారు చేసన వ్యాఖ్యలు జనాల్లోకి బాగా వెళ్లడంతో అది టీడీపీ ఓటమిపై ప్రభావం చూపింది.

ఫలితాల్లో చిత్తరంజన్‌దాస్‌కు 54,354 ఓట్లు, ఎన్టీఆర్‌కు 50,786 ఓట్లు వచ్చాయి. తద్వారా 3,568 ఓట్ల తేడాతో రామారావుపై ఘన విజయం సాధించిన చిత్తరంజన్‌ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.

ఇక ఆ ఎన్నికల్లో రాష్ట్రంలోని 294 నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్ 181 స్థానాల్లో, టీడీపీ 74 సీట్లు కైవసం చేసుకున్నాయి. మర్రి చెన్నారెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి  అయ్యారు. కల్వకుర్తిలో పోటీ చేయమన్న జైపాల్ రెడ్డి సలహాను పాటించకుండా వుండివుంటే ఎన్టీఆర్ ఓడిపోయేవారు కాదని ఆయన అభిమానులు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. 

కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కన్నుమూత

జైపాల్ రెడ్డి అస్తమయం: ఆ కల తీరకుండానే

సిఎం పదవిని తిరస్కరించిన జైపాల్ రెడ్డి: ఎందుకంటే...

కారణమిదే: తండ్రిని ఎదిరించిన జైపాల్ రెడ్డి

జైపాల్‌రెడ్డి సలహా విని ఓడిపోయిన ఎన్టీఆర్

ఎమర్జెన్సీని విధించిన ఇందిరాగాంధీపై పోటీ చేసి...

జైపాల్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

తెలంగాణ ఉద్యమం: జాతీయవాదిగా ప్రకటించుకొన్న జైపాల్ రెడ్డి

ఆయన సేవలు చిరస్మరణీయం: జైపాల్ మృతిపై రాహుల్ సంతాపం

మంచి మిత్రుడిని కోల్పోయా: జైపాల్‌రెడ్డికి నివాళులర్పించిన వెంకయ్య

జైపాల్ రెడ్డి గురించి ప్రముఖులు ఏమన్నారంటే...!!

అధికారిక లాంఛనాలతో జైపాల్ రెడ్డి అంత్యక్రియలు, కేసీఆర్ ఆదేశాలు