జైపాల్ రెడ్డి అస్తమయం: ఆ కల తీరకుండానే

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తన సుధీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పదవులు నిర్వహించారు. అయితే ముఖ్యమంత్రి కావాలన్నది ఆయన కల.

jaipal reddy dream not fulfilled

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తన సుధీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పదవులు నిర్వహించారు. అయితే ముఖ్యమంత్రి కావాలన్నది ఆయన కల.. గ్రూపు రాజకీయాలకు, కుమ్ములాటకు కేరాఫ్ ఆడ్రస్ లాంటి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లో అనేక మంది ఉద్దండులైన నేతలు ఉండేవారు.

వారందరి మధ్య నెట్టుకుని రావడం కష్టమే అయినప్పటికీ తన రాజకీయ చతురతతో కీలక నేతగా ఎదిగారు. 1969 నుంచి 1984 మధ్య వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన జైపాల్ రెడ్డి.. నాటి తెలంగాణ, జై ఆంధ్రా ఉద్యమాల మధ్య ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రయత్నించారని చెబుతారు.

అయితే ఆ హేమాహేమీల మధ్య తన కల నెరవేరడం కష్టమని భావించి తన రాజకీయ కార్యక్షేత్రాన్ని ఢిల్లీకి మార్చారు. 1984లో తొలిసారి ఎంపీగా అయిన ఆయన.. అక్కడి నుంచి రాష్ట్ర రాజకీయాల వైపు తొంగి చూడలేదు.

రెండు సార్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించారని జైపాల్ రెడ్డి మిత్రుడు నర్సింహారెడ్డి తెలిపారు.

ఇక తాజాగా ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం రేసులో లేనని స్పష్టంగా చెప్పేశారు. వయసు రీత్యా అసెంబ్లీ  ఎన్నికల్లో సైతం పోటీ చేయలేనని తేల్చి చెప్పి... ఊహాగానాలకు తెరదించారు. 

కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కన్నుమూత

జైపాల్ రెడ్డి అస్తమయం: ఆ కల తీరకుండానే

సిఎం పదవిని తిరస్కరించిన జైపాల్ రెడ్డి: ఎందుకంటే...

కారణమిదే: తండ్రిని ఎదిరించిన జైపాల్ రెడ్డి

జైపాల్‌రెడ్డి సలహా విని ఓడిపోయిన ఎన్టీఆర్

ఎమర్జెన్సీని విధించిన ఇందిరాగాంధీపై పోటీ చేసి...

జైపాల్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

తెలంగాణ ఉద్యమం: జాతీయవాదిగా ప్రకటించుకొన్న జైపాల్ రెడ్డి

ఆయన సేవలు చిరస్మరణీయం: జైపాల్ మృతిపై రాహుల్ సంతాపం

మంచి మిత్రుడిని కోల్పోయా: జైపాల్‌రెడ్డికి నివాళులర్పించిన వెంకయ్య

జైపాల్ రెడ్డి గురించి ప్రముఖులు ఏమన్నారంటే...!!

అధికారిక లాంఛనాలతో జైపాల్ రెడ్డి అంత్యక్రియలు, కేసీఆర్ ఆదేశాలు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios