మంచి మిత్రుడిని కోల్పోయా: జైపాల్‌రెడ్డికి నివాళులర్పించిన వెంకయ్య
జైపాల్ రెడ్డి మరణంతో మంచి మిత్రుడిని కోల్పోయానంటూ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న వెంటనే జూబ్లీహిల్స్‌లోని జైపాల్ రెడ్డి నివాసానికి చేరుకున్న వెంకయ్య.. ఆయన పార్థీవ దేహానికి నివాళులర్పించారు.

అనంతరం ఉప రాష్ట్రపతి మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఇద్దరం ఒకే బెంచీలో రెండు పర్యాయాలు కూర్చున్నామన్నారు. శాసనసభ్యుడిగా, పార్లమెంటేరియన్‌గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని వెంకయ్య ప్రశంసించారు.
ఆయన మేథాశక్తి, విమర్శనా శైలి, విషయ పరిజ్ఞానం, భాషా ప్రావీణ్యం అద్భుతమని వెంకయ్య తెలిపారు. ఆయన చూపిన మార్గంలో శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు నడిచి రాజకీయాల్లో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడమే జైపాల్ రెడ్డికి మనమిచ్చి నివాళి అని ఉపరాష్ట్రపతి తెలిపారు.
కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కన్నుమూత
జైపాల్ రెడ్డి అస్తమయం: ఆ కల తీరకుండానే
సిఎం పదవిని తిరస్కరించిన జైపాల్ రెడ్డి: ఎందుకంటే...
కారణమిదే: తండ్రిని ఎదిరించిన జైపాల్ రెడ్డి
జైపాల్‌రెడ్డి సలహా విని ఓడిపోయిన ఎన్టీఆర్
ఎమర్జెన్సీని విధించిన ఇందిరాగాంధీపై పోటీ చేసి...
జైపాల్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
తెలంగాణ ఉద్యమం: జాతీయవాదిగా ప్రకటించుకొన్న జైపాల్ రెడ్డి
ఆయన సేవలు చిరస్మరణీయం: జైపాల్ మృతిపై రాహుల్ సంతాపం
మంచి మిత్రుడిని కోల్పోయా: జైపాల్‌రెడ్డికి నివాళులర్పించిన వెంకయ్య
జైపాల్ రెడ్డి గురించి ప్రముఖులు ఏమన్నారంటే...!!
అధికారిక లాంఛనాలతో జైపాల్ రెడ్డి అంత్యక్రియలు, కేసీఆర్ ఆదేశాలు