కాంగ్రెస్ పార్టీ నేత జైపాల్ రెడ్డి ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు.

జైపాల్ రెడ్డికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.కొద్ది రోజులుగా నిమోనియా వ్యాధితో జైపాల్ రెడ్డి బాధపడుతున్నారు. 1969-1984 మధ్య జైపాల్ రెడ్డి నాలుగు దఫాలు ఉమ్మడి ఏపీ అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారు.

1991-92లో రాజ్యసభలో ప్రతిపక్షనేతగా జైపాల్ రెడ్డి వ్యవహరించారు. తీవ్ర జ్వరంతో బాధపడుతు జైపాల్ రెడ్డి ఆసుపత్రిలో చేరారు.ఏషియన్ గ్యాస్ ఎంటరాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున జైపాల్ రెడ్డి మరణించారు. 

 1999,2004 ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎంపీ స్థానం నుండి జైపసాల్ రెడ్డి ఎన్నికయ్యారు. 1984లో జైపాల్ రెడ్డి మహాబూబ్ నగర్ ఎంపీగా విజయం సాధించారు.1984,1998,1999,2004,2009లలో జైపాల్ రెడ్డి పలు పార్లమెంట్ స్థానాల నుండి ఎంపీగా విజయం సాధించారు. రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా జైపాల్ రెడ్డి పనిచేశారు.

1998లో ఐకే గుజ్రాల్ కేబినెట్ లో సమాచార శాఖ మంత్రిగా జైపాల్ రెడ్డి పనిచేశారు. 1999లో జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.2004 ఎన్నికల్లో మిర్యాలగూడ ఎంపీ స్థానం నుండి జైపాల్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆ సమయంలో మన్మోహన్ సింగ్ కేబినెట్ లో చోటు దక్కించుకొన్నారు.

ఆ తర్వాత 2009 ఎన్నికల్లో కూడ జైపాల్ రెడ్డి చేవేళ్ల నుండి పోటీ చేసి విజయం సాధించారు. మన్మోహన్ కేబినెట్ లో మరోసారి ఆయనకు బెర్త్ దక్కింది.2012-14 మధ్యలో సైన్స్ , టెక్నాలజీ మంత్రిగా జైపాల్ రెడ్డి పనిచేశారు.1998లో జైపాల్ రెడ్డికి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు దక్కింది.

ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి జనతా పార్టీలో చేరారు. జనతాదళ్ రాజకీయాల్లో ఆయన కీలకంగా పనిచేశారు. జనతాదళ్ లో చీలికలు వచ్చిన సమయంలో 1999లో జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కన్నుమూత

జైపాల్ రెడ్డి అస్తమయం: ఆ కల తీరకుండానే

సిఎం పదవిని తిరస్కరించిన జైపాల్ రెడ్డి: ఎందుకంటే...

కారణమిదే: తండ్రిని ఎదిరించిన జైపాల్ రెడ్డి

జైపాల్‌రెడ్డి సలహా విని ఓడిపోయిన ఎన్టీఆర్

ఎమర్జెన్సీని విధించిన ఇందిరాగాంధీపై పోటీ చేసి...

జైపాల్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

తెలంగాణ ఉద్యమం: జాతీయవాదిగా ప్రకటించుకొన్న జైపాల్ రెడ్డి

ఆయన సేవలు చిరస్మరణీయం: జైపాల్ మృతిపై రాహుల్ సంతాపం

మంచి మిత్రుడిని కోల్పోయా: జైపాల్‌రెడ్డికి నివాళులర్పించిన వెంకయ్య

జైపాల్ రెడ్డి గురించి ప్రముఖులు ఏమన్నారంటే...!!

అధికారిక లాంఛనాలతో జైపాల్ రెడ్డి అంత్యక్రియలు, కేసీఆర్ ఆదేశాలు