జైపాల్ రెడ్డి గురించి ప్రముఖులు ఏమన్నారంటే...!!
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కొందరు ఆయన నివాసానికి చేరుకుని జైపాల్ రెడ్డి పార్థీవ దేహానికి నివాళులర్పించగా... మరికొందరు సోషల్ మీడియా ద్వారా సంతాప సందేశాన్ని తెలియజేశారు
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కొందరు ఆయన నివాసానికి చేరుకుని జైపాల్ రెడ్డి పార్థీవ దేహానికి నివాళులర్పించగా... మరికొందరు సోషల్ మీడియా ద్వారా సంతాప సందేశాన్ని తెలియజేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... జూబ్లీహిల్స్‌లోని జైపాల్ రెడ్డి ఇంటికి చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన వెంటన టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేకే, మంత్రులు ఉన్నారు.
ఉత్తమ పార్లమెంటేరియన్‌గా జైపాల్ రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గుర్తు చేశారు. జైపాల్ రెడ్డి తన రాజకీయ జీవితంలో అనుక్షణం ప్రజల కోసం తపించారని ప్రధాని నరేంద్రమోడీ కొనియాడారు. తన వాగ్థాటి, భాషా పటిమతో ఎన్నో అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేవారని ప్రధాని ట్వీట్ చేశారు.
జైపాల్ రెడ్డి మరణం తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు తీరని లోటన్నారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఓ మంచి నాయకుడిని కోల్పోయామంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో జైపాల్ రెడ్డి కీలకపాత్ర పోసించారని ఆయన మృతితో కాంగ్రెస్ పార్టీ శోక సంద్రంలో మునిగిపోయిందన్నారు. తనకు అత్యంత సన్నిహితుడని.. ఆయనని కోల్పోవడం చాలా బాధకరంగా ఉందన్నారు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ.
జైపాల్ రెడ్డి ఆయన లాంటి వ్యక్తులు అరుదుగా కనిపిస్తారని.. నీతి, నిజాయితీలకు ఆయన మారుపేరని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కన్నుమూత
జైపాల్ రెడ్డి అస్తమయం: ఆ కల తీరకుండానే
సిఎం పదవిని తిరస్కరించిన జైపాల్ రెడ్డి: ఎందుకంటే...
కారణమిదే: తండ్రిని ఎదిరించిన జైపాల్ రెడ్డి
జైపాల్‌రెడ్డి సలహా విని ఓడిపోయిన ఎన్టీఆర్
ఎమర్జెన్సీని విధించిన ఇందిరాగాంధీపై పోటీ చేసి...
జైపాల్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
తెలంగాణ ఉద్యమం: జాతీయవాదిగా ప్రకటించుకొన్న జైపాల్ రెడ్డి
ఆయన సేవలు చిరస్మరణీయం: జైపాల్ మృతిపై రాహుల్ సంతాపం
మంచి మిత్రుడిని కోల్పోయా: జైపాల్‌రెడ్డికి నివాళులర్పించిన వెంకయ్య
జైపాల్ రెడ్డి గురించి ప్రముఖులు ఏమన్నారంటే...!!
అధికారిక లాంఛనాలతో జైపాల్ రెడ్డి అంత్యక్రియలు, కేసీఆర్ ఆదేశాలు