హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తండ్రికి ఎదిగారు.పేద ప్రజల పక్షపాతిగా జైపాల్ రెడ్డి చిన్నతనంలోనే తండ్రికి తీసుకొన్న నిర్ణయాలకు వ్యతిరేకించారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడ్గుల మండలకేంద్రంలో జైపాల్ రెడ్డి యశోద, దుర్గారెడ్డి దంపతులకు జన్మించారు. జైపాల్ రెడ్డికి పోలియో వ్యాధి కారణంగా రెండు కాళ్లు చచ్చుపడిపోయాయి.

తాను పుట్టిన గ్రామంలో ఉన్నత విద్యను అభ్యసించే సౌకర్యం లేని కారణంగా జైపాల్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ స్కూల్ లో జైపాల్ రెడ్డి విద్యాబ్యాసం చేశారు. 

జైపాల్ రెడ్డి తండ్రి గ్రామంలోని రైతులకు, ఇతరులకు వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడు. వడ్డీలకు డబ్బులు ఇవ్వడాన్ని జైపాల్ రెడ్డి వ్యతిరేకించేవాడు. చదువుకొనే రోజుల్లోనే ఈ విషయమై తండ్రితో విభేదించినట్టుగా ఆయన సన్నిహితులు గుర్తు చేసుకొనేవారు.

అప్పులు ఇచ్చిన సమయంలో వడ్డీ పత్రాలను  రాయించుకొని జైపాల్ రెడ్డి తండ్రి తన ఇంట్లో పెట్టుకొనేవాడు.వడ్డీలకు డబ్బులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ  జైపాల్ రెడ్డి తన ఇంట్లో ఉన్న వడ్డీ పత్రాలను చింపివేశాడు. ఈ ఘటన ఆ సమయంలో ఆ ప్రాంతంలో చర్చకు దారితీసింది.

ఈ ఘటనతో జైపాల్ రెడ్డి తండ్రి డబ్బులను వడ్డీలకు ఇవ్వడం మానివేసినట్టుగా చెబుతారు. అయితే  ఈ ఘటన జైపాల్ రెడ్డికి  ఆ ప్రాంతంలో మంచి పేరు తీసుకువచ్చింది. ఆ తర్వాత కాలంలో కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుండి జైపాల్ రెడ్డి పోటీ చేసి  ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

సంబంధిత వార్తలు

 

కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కన్నుమూత

జైపాల్ రెడ్డి అస్తమయం: ఆ కల తీరకుండానే

సిఎం పదవిని తిరస్కరించిన జైపాల్ రెడ్డి: ఎందుకంటే...

కారణమిదే: తండ్రిని ఎదిరించిన జైపాల్ రెడ్డి

జైపాల్‌రెడ్డి సలహా విని ఓడిపోయిన ఎన్టీఆర్

ఎమర్జెన్సీని విధించిన ఇందిరాగాంధీపై పోటీ చేసి...

జైపాల్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

తెలంగాణ ఉద్యమం: జాతీయవాదిగా ప్రకటించుకొన్న జైపాల్ రెడ్డి

ఆయన సేవలు చిరస్మరణీయం: జైపాల్ మృతిపై రాహుల్ సంతాపం

మంచి మిత్రుడిని కోల్పోయా: జైపాల్‌రెడ్డికి నివాళులర్పించిన వెంకయ్య

జైపాల్ రెడ్డి గురించి ప్రముఖులు ఏమన్నారంటే...!!

అధికారిక లాంఛనాలతో జైపాల్ రెడ్డి అంత్యక్రియలు, కేసీఆర్ ఆదేశాలు