MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • హైద‌రాబాద్‌లో భూముల‌ ధ‌ర‌లు చూసి భ‌య‌ప‌డుతున్నారా.? ఇక్క‌డ ఇన్వెస్ట్ చేస్తే బంగారు భ‌విష్య‌త్తు

హైద‌రాబాద్‌లో భూముల‌ ధ‌ర‌లు చూసి భ‌య‌ప‌డుతున్నారా.? ఇక్క‌డ ఇన్వెస్ట్ చేస్తే బంగారు భ‌విష్య‌త్తు

Real estate: హైద‌రాబాద్‌తో పాటు తెలంగాణ‌లో ప‌లు ప‌ట్ట‌ణాల్లో భూముల ధ‌ర‌లు పెరుగుతున్నాయి. ఇందులో సిద్ధిపేట కూడా ఒక‌టి. రాజకీయ, పరిపాలనా ప్రాధాన్యంతో పాటు మౌలిక సదుపాయాల పెరుగుదల ఈ ప్రాంతాన్ని ప్ర‌త్యేకంగా నిల‌బెడుతోంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 03 2026, 08:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అపార్ట్‌మెంట్ ధరలు – హైదరాబాద్‌తో పోల్చితే భారీ తేడా
Image Credit : Hi Hyderabad, KTR, Former Minister/X

అపార్ట్‌మెంట్ ధరలు – హైదరాబాద్‌తో పోల్చితే భారీ తేడా

ప్రస్తుతం సిద్ధిపేటలో డబుల్ బెడ్ రూమ్ అపార్ట్‌మెంట్ ధర రూ. 35 లక్షల నుంచి రూ. 45 లక్షల మధ్య లభిస్తోంది. హైదరాబాద్‌లో ఇదే స్థాయి ఫ్లాట్ కొనాలంటే దాదాపు రెట్టింపు ఖర్చు అవసరం. అంతేకాదు, డబుల్ బెడ్ రూమ్ ఇంటికి నెలకు సుమారు రూ. 10,000 వరకు అద్దె వస్తోంది. ఈ లెక్కన చూస్తే అద్దె ఆదాయం కూడా స్థిరంగా ఉంటుంది. చిన్న స్థాయి పెట్టుబడితో రెంటల్ ఇన్‌కమ్ కోరుకునే వారికి ఇది సరైన ఎంపికగా కనిపిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
శామీర్‌పేట కనెక్టివిటీ.. మెట్రో, ఎలివేటెడ్ కారిడార్ ప్రభావం
Image Credit : X

శామీర్‌పేట కనెక్టివిటీ.. మెట్రో, ఎలివేటెడ్ కారిడార్ ప్రభావం

సిద్ధిపేట నుంచి శామీర్‌పేట రింగ్ రోడ్డు దూరం సుమారు 70 కిలోమీటర్లు మాత్రమే. సాధారణంగా గంట నుంచి గంట‌న్న‌ర‌లో అక్కడికి చేరుకోవచ్చు. శామీర్‌పేట వరకు మెట్రో విస్తరణ ప్రణాళికలో ఉంది. అది అమలైతే నగరంలోని ప్రధాన ప్రాంతాలకు సుమారు 2.5 గంటల్లో చేరే అవకాశం ఉంటుంది. ఇక జూబ్లీ బస్ స్టేషన్ (JBS) నుంచి శామీర్‌పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ కూడా రానుంది. ఈ రహదారి పూర్తైతే ట్రాఫిక్ సమస్యలు తగ్గి, ప్రయాణ సమయం మరింత తగ్గే అవకాశముంది. ఈ మార్పులు సిద్ధిపేట రియల్ ఎస్టేట్ విలువను పెంచే అంశాలుగా భావించవచ్చు.

35
ట్రిపులార్‌, రాజీవ్ రహదారి – భవిష్యత్ వృద్ధికి బలమైన కారణాలు
Image Credit : our own

ట్రిపులార్‌, రాజీవ్ రహదారి – భవిష్యత్ వృద్ధికి బలమైన కారణాలు

సిద్ధిపేట నుంచి ట్రిపుల్ ఆర్ రోడ్డుకు దూరం సుమారు 40 కిలోమీటర్లు మాత్రమే. ఈ రింగ్ రోడ్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు వేగంగా చేరుకునే సౌకర్యం పెరుగుతుంది. అలాగే రాజీవ్ రహదారి విస్తరణకు అవకాశాలు ఉన్నాయి. ఈ రహదారి మెరుగుపడితే హైదరాబాద్–సిద్ధిపేట ప్రయాణం మరింత సులభం అవుతుంది. కనెక్టివిటీ పెరిగిన ప్రాంతాల్లో ఆస్తుల ధరలు క్రమంగా పెరగడం సాధారణమే.

45
ఐటీ టవర్స్, కాలేజీలు – పట్టణ అభివృద్ధికి బలమైన పునాది
Image Credit : KTR/X

ఐటీ టవర్స్, కాలేజీలు – పట్టణ అభివృద్ధికి బలమైన పునాది

సిద్ధిపేటలో ఐటీ టవర్, మెడికల్ కాలేజీలు, ఫార్మా కాలేజీలు ఇప్పటికే ఉన్నాయి. విద్య, ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల ఇక్కడ స్థిరపడే కుటుంబాల సంఖ్య పెరుగుతోంది. పర్యాటక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలు కూడా సమీపంలో ఉన్నాయి. దీంతో వ్యాపార కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పట్టణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి.

55
దుద్దెడ, కొమరవెల్లి – రెండో పెట్టుబడికి మంచి అవకాశాలు
Image Credit : Gemini AI

దుద్దెడ, కొమరవెల్లి – రెండో పెట్టుబడికి మంచి అవకాశాలు

సిద్ధిపేట పట్టణంతో పాటు దుద్దెడ, కొమరవెల్లి ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికీ ధరలు ఎక్కువగా పెరగలేదు (హైద‌రాబాద్‌తో పోల్చితే) . సెకండ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం చూస్తున్న వారికి ఇవి ఆచరణ సాధ్యమైన ఎంపికలు. భవిష్యత్‌లో మౌలిక వసతులు మరింత మెరుగుపడితే ఈ ప్రాంతాల్లో ఆస్తుల విలువ పెరిగే అవకాశం ఉంది.

మొత్తంమీద సిద్ధిపేటలో ప్రస్తుతం ఉన్న ధరలు మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉన్నాయి. అద్దె ఆదాయం కూడా స్థిరంగా ఉంది. కనెక్టివిటీ ప్రాజెక్టులు, విద్యాసంస్థలు, పారిశ్రామిక వృద్ధి వంటి అంశాలు భవిష్యత్ విలువ పెరుగుదలకు బలం ఇస్తున్నాయి.

గ‌మ‌నిక‌: రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్టుబ‌డులు పెట్టే ముందు కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. పెట్టుబడి పెట్టే ముందు లీగల్ క్లారిటీ, భూమి డాక్యుమెంట్లు, అభివృద్ధి స్థాయి వంటి అంశాలు పరిశీలించడం అవసరం. సరైన ప్రణాళికతో ముందడుగు వేస్తే రియల్ ఎస్టేట్ మంచి పెట్టుబ‌డి ఆప్ష‌న్‌గా మార్చుకోవ‌చ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
స్థిరాస్తి
తెలంగాణ
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
పశ్చిమ బెంగాల్ అయిపోయింది... ఇక టార్గెట్ తెలంగాణే..: అమిత్ షా
Recommended image2
School Holidays : తెలంగాణపైనా మురసు తుపాను అటాక్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, స్కూళ్లకి సెలవులు
Recommended image3
Cyclone: తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను ముప్పు.. 5 ఐదు రోజులు భారీ వర్షాలు
Related Stories
Recommended image1
గ్ర‌హ‌ణ స‌మ‌యంలో భార్యాభ‌ర్త‌లు క‌ల‌వ‌కూడ‌దా.? శాస్త్రం ఏమంటోంది, సైన్స్ ఏం చెబుతోంది.
Recommended image2
Mamidi Konala Meena: యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న మ‌రో ఫోక్ సాంగ్‌.. పాట వింటే కాలు క‌ద‌పాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved