ఎమర్జెన్సీని విధించిన ఇందిరాగాంధీపై పోటీ చేసి...

ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా  నేత జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆ తర్వాత ఆయన జనతా పార్టీలో చేరారు. జనతా పార్టీలో కూడ ఆయన కీలకంగా పనిచేశారు.

jaipal reddy contested in medak mp segment against indira gandhi

హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల కేంద్రంలో పుట్టిన జైపాల్ రెడ్డి దివంగత మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీపై పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో ఆ పార్టీ తీసుకొన్న నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని వీడారు.

ఉస్మానియా యూనివర్శిటీలో జైపాల్ రెడ్డి ఎంఏ పట్టా పొందారు. ఉస్మానియా యూనివర్శిటీలో జైపాల్ రెడ్డి విద్యార్థినేతగా ఎన్నికయ్యారు. యూనివర్శిటీలో చదివే రోజుల్లోనే ఆయన నాయకుడిగా పేరొందాడు.

ఆ తర్వాత జైపాల్ రెడ్డి రాజకీయాల్లో కొనసాగారు. చదువుకొనే సమయంలోనే  జైపాల్ రెడ్డి యూత్ కాంగ్రెస్ లో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ 1977లో ఎమర్జెన్సీని విధించింది. ఎమర్జెన్సీని జైపాల్ రెడ్డి వ్యతిరేకించారు. 

ఎమర్జెన్సీని వ్యతిరేకించిన జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడి జనతా పార్టీలో చేరారు. 1999 వరకు జైపాల్ రెడ్డి జనతా పార్టీలో కొనసాగారు. ఎమర్జెన్సీని విధించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించారు.

1980లో జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాందీ మెదక్ ఎంపీ స్థానం నుండి పోటీ చేశారు. ఆ సమయంలో ఇందిరాగాంధీ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఇందిరాగాంధీపై జైపాల్ రెడ్డి పోటీ చేశారు. కానీ, ఆ సమయంలో ఆయన జనతా పార్టీలో ఉన్నారు.

మెదక్ ప్రజలు జైపాల్ రెడ్డికి బదులుగా ఇందిరాగాంధీని గెలిపించారు.తాను నమ్మిన సిద్దాంతాల కోసం జైపాల్ రెడ్డి చివరివరకు కట్టుబడి ఉన్నారని ఆయన సన్నిహితులు గుర్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

 

కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కన్నుమూత

జైపాల్ రెడ్డి అస్తమయం: ఆ కల తీరకుండానే

సిఎం పదవిని తిరస్కరించిన జైపాల్ రెడ్డి: ఎందుకంటే...

కారణమిదే: తండ్రిని ఎదిరించిన జైపాల్ రెడ్డి

జైపాల్‌రెడ్డి సలహా విని ఓడిపోయిన ఎన్టీఆర్

ఎమర్జెన్సీని విధించిన ఇందిరాగాంధీపై పోటీ చేసి...

జైపాల్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

తెలంగాణ ఉద్యమం: జాతీయవాదిగా ప్రకటించుకొన్న జైపాల్ రెడ్డి

ఆయన సేవలు చిరస్మరణీయం: జైపాల్ మృతిపై రాహుల్ సంతాపం

మంచి మిత్రుడిని కోల్పోయా: జైపాల్‌రెడ్డికి నివాళులర్పించిన వెంకయ్య

జైపాల్ రెడ్డి గురించి ప్రముఖులు ఏమన్నారంటే...!!

అధికారిక లాంఛనాలతో జైపాల్ రెడ్డి అంత్యక్రియలు, కేసీఆర్ ఆదేశాలు

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios