సిఎం పదవిని తిరస్కరించిన జైపాల్ రెడ్డి: ఎందుకంటే...
ముఖ్యమంత్రిగా కె. రోశయ్య స్థానంలో కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసే సమయంలో జైపాల్ రెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చింది. ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ జైపాల్ రెడ్డిని కోరారు.
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని ఎస్ జైపాల్ రెడ్డి తిరస్కరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో ఆయనను ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెసు అధిష్టానం భావించింది. నిజానికి, ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనేది ఆయన కల. తన కల నెరవేరే సందర్భం వచ్చినప్పటికీ ఆయన దాన్ని తిరస్కరించారు.
ముఖ్యమంత్రిగా కె. రోశయ్య స్థానంలో కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసే సమయంలో జైపాల్ రెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చింది. ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ జైపాల్ రెడ్డిని కోరారు. అయితే, అందుకు ఆయన అంగీకరించలేదు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడుతున్న సమయంలో తెలంగాణకు చెందిన జైపాల్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే పరిస్థితి చక్కబడుతుందని సోనియా గాంధీ భావించారు. అయితే, జైపాల్ రెడ్డి సోనియా గాంధీ ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు. తాను ముఖ్యమంత్రి పదవి చేపడితే తెలంగాణ ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయనే భావనతో ఆయన ఆ పదవిని ఆయన తిరస్కరించారు. ఆయన వెనక్కి తగ్గడంతో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కన్నుమూత
జైపాల్ రెడ్డి అస్తమయం: ఆ కల తీరకుండానే
సిఎం పదవిని తిరస్కరించిన జైపాల్ రెడ్డి: ఎందుకంటే...
కారణమిదే: తండ్రిని ఎదిరించిన జైపాల్ రెడ్డి
జైపాల్‌రెడ్డి సలహా విని ఓడిపోయిన ఎన్టీఆర్
ఎమర్జెన్సీని విధించిన ఇందిరాగాంధీపై పోటీ చేసి...
జైపాల్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
తెలంగాణ ఉద్యమం: జాతీయవాదిగా ప్రకటించుకొన్న జైపాల్ రెడ్డి
ఆయన సేవలు చిరస్మరణీయం: జైపాల్ మృతిపై రాహుల్ సంతాపం
మంచి మిత్రుడిని కోల్పోయా: జైపాల్‌రెడ్డికి నివాళులర్పించిన వెంకయ్య
జైపాల్ రెడ్డి గురించి ప్రముఖులు ఏమన్నారంటే...!!
అధికారిక లాంఛనాలతో జైపాల్ రెడ్డి అంత్యక్రియలు, కేసీఆర్ ఆదేశాలు