తెలంగాణ ఉద్యమం: జాతీయవాదిగా ప్రకటించుకొన్న జైపాల్ రెడ్డి

తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకొన్న సమయంలో జైపాల్ రెడ్డి జాతీయవాదిగా ప్రకటించుకొన్నారు,తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో జైపాల్ రెడ్డి చేసిన ప్రకటనను ఆయన ప్రత్యర్ధులు విమర్శించారు.

Jaipal Reddys anti-regional sound bytes rattle T advocates ..

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీలో జైపాల్ రెడ్డి విద్యార్ధినేతగా ఎదిగారు. తొలుత ఆయన సమైక్యవాదిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన తెలంగాణ వాదాన్ని సమర్ధించారు.. మలిదశ తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో జైపాల్ రెడ్డి జాతీయవాదిగా ప్రకటించుకొన్నారు.

ఉస్మానియా యూనివర్శిటీలోనే జైపాల్ రెడ్డి  విద్యార్ధినేతగా ఎదిగారు. తొలి దశ తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో జైపాల్ రెడ్డి సమైక్యవాదిగా ఉన్నాడు. ఆ తర్వాత కాలంలో ఆయన తన వైఖరిని మార్చుకొన్నారు.

జైపాల్ రెడ్డి తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 1977లో కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీని విధించడంతో ఆయన జనతా పార్టీలో చేరారు.  జనతాదళ్ పార్టీ ముక్కలు చెక్కలైన తర్వాత జైపాల్ రెడ్డి 1999లో కాంగ్రెస్ పార్టీలో చేరారు.  మలిదశ తెలంగాణ ఉద్యమంలో జైపాల్ రెడ్డి ప్రత్యక్ష పాత్ర పోషించలేదు.

తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఆందోళనలు నిర్వహించారు. ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో జైపాల్ రెడ్డి తెలంగాణలోని చేవేళ్ల నుండి ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. అంతేకాదు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో మంత్రిగా కూడ ఉన్నారు.

తెలంగాణ ఉద్యమం గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన తాను జాతీయవాదిని అంటూ ప్రకటించుకొన్నారు.ఈ ప్రకటనపై ఆనాడు జైపాల్ రెడ్డిపై ప్రత్యర్థులు విమర్శలు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి కాంగ్రెస్ పార్టీ పెద్దలను ఒప్పించడంలో జైపాల్ రెడ్డి కీలకపాత్ర పోషించినట్టుగా చెబుతారు. అంతేకాదు హైద్రాబాద్ లేకుండా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం వల్ల ప్రయోజనం కూడ ఉండదనే విషయాన్ని కూడ జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వివరించినట్టుగా చెబుతారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాలని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొంటున్న సమయంలో జైపాల్ రెడ్డి వాస్తవ పరిస్థితులను జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అందించినట్టుగా ఆ పార్టీ నేతలు గుర్తు చేసుకొంటున్నారు.


సంబంధిత వార్తలు

 

కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కన్నుమూత

జైపాల్ రెడ్డి అస్తమయం: ఆ కల తీరకుండానే

సిఎం పదవిని తిరస్కరించిన జైపాల్ రెడ్డి: ఎందుకంటే...

కారణమిదే: తండ్రిని ఎదిరించిన జైపాల్ రెడ్డి

జైపాల్‌రెడ్డి సలహా విని ఓడిపోయిన ఎన్టీఆర్

ఎమర్జెన్సీని విధించిన ఇందిరాగాంధీపై పోటీ చేసి...

జైపాల్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

తెలంగాణ ఉద్యమం: జాతీయవాదిగా ప్రకటించుకొన్న జైపాల్ రెడ్డి

ఆయన సేవలు చిరస్మరణీయం: జైపాల్ మృతిపై రాహుల్ సంతాపం

మంచి మిత్రుడిని కోల్పోయా: జైపాల్‌రెడ్డికి నివాళులర్పించిన వెంకయ్య

జైపాల్ రెడ్డి గురించి ప్రముఖులు ఏమన్నారంటే...!!

అధికారిక లాంఛనాలతో జైపాల్ రెడ్డి అంత్యక్రియలు, కేసీఆర్ ఆదేశాలు

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios