తెలుగు మంత్రుల గుండెల్లో శ్రీ రెడ్డి బాంబు

First Published 13, Apr 2018, 5:29 PM IST
Srireddy to reveal the amorous secrets of a telugu minister
Highlights
ఆ రాసలీలల మంత్రి ఎవరబ్బా ?

దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగు సినీ పరిశ్రమను షేక్ చేసిన నటి శ్రీరెడ్డి టార్గెట్ ఇప్పుడు రాజకీయ రంగంపై పెట్టింది. తొలి స్పెల్ లోనే ఒక తెలుగు మంత్రిని బజారుకు ఇడ్చేందుకు రెడీగా ఉన్నట్లు శ్రీరెడ్డి ఒక లీక్ వదిలింది. తొందరలోనే తెలుగు మంత్రి గారి రాసలీలలు చూస్తారా? అని ఒక బాంబును ఫేస్ బుక్ లో తన గోడ మీద నుంచి వదిలింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతల గుండెల్లో గుబులు మొదలైంది. ఇంతకూ శ్రీరెడ్డి వదిలిన బాంబు ఎవరి గురించి? ఎవరా తెలుగు మంత్రి? ఏమా కథ ? చదవండి మొత్తం స్టోరీ.

 

గత కొంతకాలంగా తెలుగు సినీ పరిశ్రమ పెద్దలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది యాంకర్ శ్రీరెడ్డి. ఆమె నటించింది కొన్ని సినిమాల్లోనే అయినా.. తాజాగా ఆమె అందరి జాతకాలు బయటపెడుతున్నది. సినీ ఇండస్ట్రీలో రారాజులుగా చెలామణి అవుతున్న వారి కోటలు బద్ధలుకొడుతున్నది. దిక్కుతోచని స్థితిలో మా అసోసియేషన్ వాళ్లు శ్రీరెడ్డిని వెలి వేశారు. ఆమెనే కాదు ఆమెతో ఎవరు నటించినా వాళ్లపై కూడా వేటు వేస్తామని హెచ్చరించింది.  అయితే అప్పుడు సమాజంలో శ్రీరెడ్డికి మద్దతు దొరికింది. మా మీద ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వెనకడుగు వేసింది. శ్రీరెడ్డి మీద వేటు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. సినీ వర్గాల్లో కూడా ఇప్పుడిప్పుడే శ్రీరెడ్డికి మద్దతు దొరుకుతున్నది.

ఇక శ్రీరెడ్డి నెక్ట్స్ టార్గెట్ పొలిటికల్ రంగం మీదకు మళ్లింది. రాజకీయ ప్రముఖులు పైకి నీతులు చెబుతూ లోపల చేయాల్సిన గలీజు పనులన్నీ చేస్తారని జనాలకు తెలిసిందే కదా? అయితే ఎక్కువ మంది రాజకీయ నేతలు తాము చేసే గలీజు పనులన్నీ ఆధారాలు లేకుండానే చేస్తారు. కొందరు మాత్రం అప్పుడో ఇప్పుడో జనాలకు దొరికిపోతుంటారు. మరి తాజాగా శ్రీరెడ్డి రాజకీయ నేతల గుండెల్లోకి బాంబు విసిరింది. త్వరలోనే తెలుగు మంత్రి గారి రాసలీలలు చూస్తారు అంటూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టింది. దీంతో రాజకీయ వర్గాల్లోనే కాదు యావత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా నిలిచింది.

మరి ఆ రాసలీలలకు పాల్పడిన మంత్రి ఎవరు? తెలంగాణ మంత్రి కావొచ్చా? లేక ఆంధ్రా మంత్రి అయి ఉండొచ్చా? అన్నది చర్చనీయాంశమైంది. మరి రాసలీలలు శ్రీరెడ్డితో జరిపారా? లేక వేరే వాళ్లతో జరిపిన రాసలీలల గుట్టు శ్రీరెడ్డి దగ్గర ఉందా? అన్నది కూడా చర్చలోకి వచ్చింది. నిజానికి శ్రీరెడ్డి ఇటీవల కాలంలో అనేక విషయాలను వెల్లడించింది. తనకు ఎవరెవరితో సంబంధాలున్నాయో? తనను ఎవరు ఎలా వాడుకున్నారో వెల్లడించింది. మరి ఇప్పుడు ఆ రాజకీయ నాయకుడైన మంత్రి గురించి వివరాలు త్వరలోనే బయటపెడతానంటూ బాంబు పేల్చింది. శ్రీరెడ్డి కామెంట్స్ తర్వాత సినీ వర్గాల్లో ఆ మంత్రి ఎవరు అనేదానిపై ఒక క్లారిటీ వచ్చినట్లు గుసగుసలు వినబడుతున్నాయి. ఇద్దరు తెలంగాణ మంత్రుల పేర్లు, మరో ఇద్దరు ఆంధ్రా మంత్రుల పేర్లు ఇప్పటికే చర్చలోకి వచ్చాయి. కచ్చితంగా ఆ నలుగురిలోనే ఒకరు ఉండి తీరతారని సినీ వర్గాలతోపాటు రాజకీయ వర్గాల్లోనూ టాక్ నడుస్తోంది.

మరికొద్దిరోజుల్లోనే శ్రీ రెడ్డి ఆ గుట్టు రట్టు చేస్తే.. ఒక తెలుగు మంత్రి గారి నౌకరి ఊడిపోవడం ఖాయం అని చెబుతున్నారు.

loader