Asianet News TeluguAsianet News Telugu

పోర్న్ కి బానిసగా మారి.. అందమైన అమ్మాయిలపై కన్నేసి..

చిన్నప్పటి నుంచే పోర్న్ కి బానిసగా మారాడు. ఈ క్రమంలో ఇన్ స్టాగ్రామ్ లో వివిధ పేర్లతో ఎకౌంట్లు తెరిచాడు.

police arrest the youth who molested woman on social media
Author
Hyderabad, First Published Jun 22, 2021, 7:30 AM IST

చిన్న వయసులోనే పోర్న్ వీడియోలు చూడటానికి బానిసగా మారాడు. ఇన్ స్టాగ్రామ్ లో అందమైన అమ్మాయిలను టార్గెట్ చేసేవాడు. ఫేక్ ఎకౌంట్లు క్రియేట్ చేసి.. సదరు అమ్మాయిలను లైంగికంగా వేధించేవాడు.  అతని వేధింపులు తట్టుకోలేక పోయిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అతని వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోనే చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పరిధిలోని గుండూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు(21) ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ.. నగరంలోని కొత్తపేటలో నివాసం ఉంటున్నాడు. చిన్నప్పటి నుంచే పోర్న్ కి బానిసగా మారాడు. ఈ క్రమంలో ఇన్ స్టాగ్రామ్ లో వివిధ పేర్లతో ఎకౌంట్లు తెరిచాడు.

ఇటీవల సంజీవరెడ్డి నగర్‌కు చెందిన మహిళ ఇన్‌స్టాగ్రామ్‌కు ఆదివారం రాత్రి ఒక మెసేజ్‌ వచ్చింది. తనతో క్రేజీచాట్‌ చేసే ఆసక్తి ఉందా? అనేది మెసేజ్‌లోని సారాంశం. అయితే అందుకు మహిళ తిరస్కరిస్తూ రిప్లై చేసింది. ఇకఅంతే.. క్రమంగా వేధింపులు మొదలయ్యాయి. మోడల్స్‌, హీరోయిన్స్‌ న్యూడ్‌ ఫొటోలతోపాటు, మహిళ కాంటాక్ట్‌ లిస్టు కూడా స్ర్కీన్‌షాట్‌ తీసి పంపించాడు. దీంతో వెంటనే ఆమె ఆ అకౌంట్‌ను బ్లాక్‌ చేసింది. 

ఇంతలో మరో గుర్తుతెలియని అకౌంట్‌ నుంచి మెసేజ్‌ వచ్చింది. ఇలా ఆమె బ్లాక్‌ చేయడం, కొత్త అకౌంట్ల నుంచి మెసేజీలు రావడం కొనసాగింది. చివరగా ఆమె స్నేహితురాలి కూతురు ఫొటోను మార్ఫింగ్‌ చేసి న్యూడ్‌ ఫొటోగా చిత్రీకరించి పంపించడంతో తీవ్ర ఆందోళనకు గురైంది. రాత్రంతా నిద్రలేకుండా తీవ్ర భయందోళనకు గురైన మహిళ సోమవారం ఉదయమే సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదుచేసింది.

ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఇప్పటి వరకు చాలా మందిని వేధించిటనట్లు విచారణలో తేలడం గమనార్హం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios