Asianet News TeluguAsianet News Telugu

''చంద్రబాబు... ఆడబిడ్డలపైనా నీ ప్రతాపం''

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆంధ్ర ప్రదేశ్ లో మహిళలపై దాడులు పెరిగిపోయాయి. అధినేేత చంద్రబాబు ఆదేశాలతో టిడిపి మూకలు మహిళలపై దాడులు చేస్తున్నాయని వైసిపి ఆరోపిస్తోంది. 

TDP Supporters Attacks on ysrcp Womens in Andhra Pradesh Assembly Elections 2024 time AKP
Author
First Published May 8, 2024, 8:20 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. అధికార వైసిపి ఒంటరిగానే పోటీచేస్తుంటే ప్రతిపక్షాలన్నీ కలిసి కూటమిగా ఏర్పడి బరిలోకి దిగాయి. అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం ముందు ఈ కూటమి నిలవలేకపోతోందని వైసిపి నాయకులు అంటున్నారు. సింహంలా సింగిల్ గా వస్తున్న జగనన్నను ఏం చేయలేక టిడిపి, జనసేన, బిజెపి కూటమి నాయకులు ప్రస్టేషన్ కు గురవుతున్నారట... అందుకోసమే మహిళలపై దాడులకు తెగబడుతున్నారని వైసిపి నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసిపి అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్యపై దాడి జరిగింది. భర్తకు మద్దతుగా ఇవాళ శిరిగిరిపాడులో పిన్నెల్లి రమాదేవి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే కొందరు రాళ్లు, కర్రలతో రమాదేవితో పాటు వెంటవచ్చిన మరికొందరు మహిళలపై దాడికి దిగారు. ఈ దాడిలో ఎమ్మెల్యే భార్యతో పాటు ఇతర మహిళలు గాయపడ్డారు. తన భర్త రామకృష్ణారెడ్డికి దక్కుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే తెలుగుదేశం పార్టీ దాని మిత్రపక్షాలు దాడులకు తెగబడుతున్నాయని రమాదేవి అన్నారు. 

 

అంతకుముందు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కోడలిపైనా ఇలాగే దాడికి యత్నించిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన బాలినేని కోడలిపై టిడిపి శ్రేణులు నానా దుర్భాషలాడి దాడికి యత్నించారు. ఇది చంద్రబాబు చేయించిన పనేనని ... తన ఫ్యామిలీని టచ్ చేస్తే చూస్తూ ఊరుకోబోనని బాలినేని హెచ్చరించారు. ఇలా ఒంగోలులో కూడా చంద్రబాబు గ్యాంగ్ మహిళలను టార్గెట్ చేసి దాడులకు తెగబడిందని వైసిపి మండిపడుతోంది. 
 
ఇక విజయవాడలో ఇలాగే వైసిపి మహిళా కార్యకర్తలపై టిడిపి అభ్యర్థి బోండా ఉమ అనుచరులు జులుం ప్రదర్శించారు. మహిళలతో పశువుల్లా ప్రవర్తిస్తూ దాడికి తెగబడ్డారని మండిసపడుతున్నారు. అంతకుముందు ఇలాగే వైసిపి సుపరిపాలన, సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న ప్రజా సక్షేమం గురించి మాట్లాడినందుకు గీతాంజలిని వేధించి చంపిన దారుణాన్ని కూడా వైసిపి గుర్తుచేస్తోంది. ఇలా సోషల్ మీడియాలో మహిళలను వేధించే స్థాయినుండి ఇప్పుడు భౌతిక దాడులకు దిగే స్థాయికి చంద్రబాబు బ్యాచ్ దిగిజారిపోయిందని మండిపడుతున్నారు.

ప్రస్తుతం ఎన్నికల వేళ టిడిపి గూండాలు మరింత రెచ్చిపోతున్నారని... స్వయంగా రాష్ట్ర హోంమంత్రిపైనే దాడికి దిగారంటేనే ఎంతకు తెగించారో అర్థమవుతుందని వైసిపి అంటోంది. మంగళవారం అర్ధరాత్రి ప్రచారం ముగించుకుని వెళుతున్న హోంమంత్రి తానేటి వనితపై టిడిపి కార్యకర్తలు దాడికి యత్నించారు. ఆమె కాన్వాయ్ లోని ఓ వాహనాన్ని ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంత్రిని ఓ గదిలోకి తీసుకెళ్లి భద్రత కల్పించారు.

ఇలా మహిళలపై కావాలనే టిడిపి శ్రేణులు దాడులు చేస్తున్నాయని వైసిపి ఆరోపిస్తోంది. చంద్రబాబు ఆదేశాలతోనే పసుపు బ్యాచ్  మహిళలను టార్గెట్ చేస్తోందని అంటున్నారు. ఈ దాడులే మహిళలపై టిడిపికి, చంద్రబాబుకు ఎంత గౌరవం వుందో తెలియజేస్తున్నాయని అన్నారు. చంద్రబాబు బ్యాచ్ అరాచకాలను మహిళా లోకం గమనిస్తోంది... ఈ ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెబుతారని వైసిపి హెచ్చరిస్తోంది. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios