Asianet News TeluguAsianet News Telugu

దోపిడీ దొంగ‘చావు’తెలివితేటలు.. హత్య చేసి, శవంపై తన సామాన్లు పెట్టి..

ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి మరో వ్యక్తిని హత్య చేశాడు. అతని ముఖాన్ని గుర్తుపట్టరాని విధంగా చేసి.. శవం వద్ద తన వస్తువులు ఉంచాడు. చనిపోయింది తానేనని అందరూ అనుకునేలా నమ్మించాడు.
 

police arrest the man who kills his friend to escape punishment
Author
Hyderabad, First Published Mar 30, 2020, 9:11 AM IST

గతంలో అతను ఓ దినసరి కూలి. ఆ తర్వాత ఎంత కష్టపడినా సంపాదన పెరగడం లేదని.. దోపిడీ దొంగగా మారాడు. తప్పించుకోవాలని ప్రయత్నించినా పోలీసులకు చిక్కాడు. కోర్టులో నేరం కూడా రుజువైంది. దాదాపు శిక్ష ఖరారైంది. దీంతో.. శిక్ష నుంచి తప్పించుకోవడానికి చావు తెలివితేటలు వాడాడు. తన రూపురేఖలకు కొద్దిగా దగ్గరగా ఉన్న వ్యక్తిని హత్య చేసి.. అక్కడ తన వస్తువులు ఉంచి.. చనిపోయింది తానేనని అందరినీ నమ్మించాడు. కానీ చివరకు పోలీసులకు చిక్కాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోని హంగార్గ్‌ ప్రాంతంలోని షోలాపూర్‌ రోడ్‌కు చెందిన రసూల్‌ సయ్యద్‌ అక్కడి ఓ ఫంక్షన్‌ హాల్‌లో దినసరి కూలీగా పని చేసేవాడు. డబ్బును తేలిగ్గా సంపాదించే మార్గాల కోసం అన్వేషించాడు. ఈ నేపథ్యంలోనే మరో ఇద్దరితో కలిసి 2016లో దోపిడీకి పాల్పడ్డాడు. పెట్రోల్‌ బంక్‌లో పని చేసే ఉద్యోగి తన సంస్థ డబ్బును బ్యాంక్‌లో డిపాజిట్‌ చేయడానికి వెళ్తుండగా దాడి చేశారు. అతడి వద్ద ఉన్న రూ. 3.2 లక్షలు తీసుకుని ఉడాయించారు. 

Also Read లాక్ డౌన్ ఎఫెక్ట్... భారీగా పెరిగిన చికెన్, మటన్ ధరలు...

ఈ కేసులో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. నేరం కూడా రుజువు కావడంతో.. శిక్ష ఖరారైంది. అయితే.. ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి మరో వ్యక్తిని హత్య చేశాడు. అతని ముఖాన్ని గుర్తుపట్టరాని విధంగా చేసి.. శవం వద్ద తన వస్తువులు ఉంచాడు. చనిపోయింది తానేనని అందరూ అనుకునేలా నమ్మించాడు.

ఈ విషయం తన భార్యకు చెప్పి కొన్నాళ్లపాటు ఇతర ప్రాంతంలో తలదాచుకుంటానని ఇంటి నుంచి వచ్చేశాడు. తర్వాత హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యాడు. ఇదిలా ఉండగా.. ఈ నెల 18న అంబజోగాయ్‌ పోలీసులకు అక్కడి రైల్వేస్టేషన్‌ సమీపంలో పడి ఉన్న శవానికి సంబంధించి సమాచారం అందింది. అక్కడకు చేరుకున్న పోలీసులు శవంపై ఉన్న వస్త్రాలు, వస్తువుల ఆధారంగా అది రసూల్‌దిగా భావించారు. 

అతడి భార్యను పిలిపించిన పోలీసులు శవాన్ని చూపించారు. విషయం ముందే తెలిసిన ఆమె అది తన భర్తదే అంటూ పోలీసులకు చెప్పింది. పోస్టుమార్టం పరీక్షలు పూర్తి చేసిన అధికారులు శవాన్ని అప్పగించడంతో అంత్యక్రియలు కూడా పూర్తి అయ్యాయి. దీంతో అంతా రసూల్‌ చనిపోయాడని భావించాడు. ఇది జరిగిన రెండు రోజులకు అలీ ఇస్మాయిల్‌ షేక్‌ కనిపించట్లేదంటూ అంబజోగాయ్‌ పోలీసులకు ఫిర్యాదు అందింది.

దీనికి తోడు భర్తను కోల్పోయిన బాధ రసూల్‌ భార్యలో కనిపించకపోవడంతో అంబజోగాయ్‌ ఇన్‌స్పెక్టర్‌ హర్ష పోద్దార్‌కు అనుమానం వచ్చింది. ఆ శవం లభించింది రైల్వేస్టేషన్‌ సమీపంలో కావడంతో స్టేషన్‌లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా విషయం అర్ధమైంది. దీంతో రైల్వేస్టేషన్‌లో రసూల్‌కు ఫోన్‌ ఇచ్చిన వ్యక్తిని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఆ రోజు రైల్వేస్టేషన్‌ నుంచి రసూల్‌ కాల్‌ చేసిన నంబర్‌ గుర్తించారు. అది హైదరాబాద్‌ శివార్లలోని రాజేంద్రనగర్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తిదిగా తేలడంతో ఓ ప్రత్యేక టీమ్‌ బుధవారం సిటీకి చేరుకుంది. చివరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios