రాంగ్‌రూట్లో వచ్చే వాహనాన్ని తప్పించబోయి ప్రమాదం: కర్ణాటక ప్రమాదంపై ఆరెంజ్ ట్రావెల్స్ యాజమాన్యం

రాంగ్ రూట్లో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోవడంతోనే తమ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైందిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం ప్రకటించింది. బస్సులోని వారిని రక్షించేందుకు చివరి వరకు ప్రయత్నింమని మేనేజ్ మెంట్ వివరించింది.
 

Orange Travels Bus management clarifies on karnataka Bus Accident

హైదరాబాద్:  రాంగ్ రూట్లో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టును బస్సు ఢీకొట్టిందని ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఆపరేషన్స్ ఇంచార్జీ చెప్పారు.  కల్వర్ట్ కు బస్సు టైర్ తగలడంతో టైరు బరస్ట్ అయి డీజీల్ ట్యాంకుకు నిప్పు అంటుకుందని అనుమానిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. 

శుక్రవారం నాడు ఉదయం Karnataka రాష్ట్రంలోని kalaburagiజిల్లా కమలపురా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు.ఈ ప్రమాదంపై ఆరెంజ్ ట్రావెల్స్ ఆపరేషన్స్ మేనేజర్ ఓ తెలుగు న్యూస్ చానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

టెక్కీ Arjun kumar గోవాకు తమ వద్ద బస్సును బుక్ చేసుకున్నారని ఆయన చెప్పారు. ఇవాళ ఉదయం ఆరుగంటల సమయంలో ప్రమాదం జరిగిందని Orange  ట్రావెల్స్ ఆపరేషన్స్ మేనేజర్ చెప్పారు. ప్రమాదం జరిగిన విషయం తమకు ఇవాళ ఉదయం ఏడున్నర గంటలకు సమాచారం అందిందన్నారు. ఈ విషయాన్ని తాము కర్ణాటకలోని తమ ట్రావెల్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చామన్నారు.  బస్సులోని ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చామన్నారు.  ఎదరుగా వచ్చిన టెంపోను తప్పించే ప్రయత్నంలోనే ప్రమాదం జరిగిందని డ్రైవర్లు తమకు సమాచారం ఇచ్చారని ఆయన వివరించారు.

also read:ప్రమాదం ఎలా జరిగిందో తెలియదు: కర్ణాటక బస్సు ప్రమాదంపై బస్సు డ్రైవర్

ప్రతి ఏటా  Techie అర్జున్ కుమార్ తమ కుటుంబ సభ్యులతో సరడాగా గడిపేందుకు వెళ్తుంటారు. గత ఏడాది అర్జున్ కుమార్ కుటుంబ సభ్యులు తిరుపతికి వెళ్లి గడిపి వచ్చారు.ఈ దఫా అర్జున్ కుటుంబ సభ్యులు గోవా వెళ్లారు. గత నెల 28న గోవా వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. అర్జున్ కూడా ఈ ప్రమాదంలో మరణించినట్టుగా తమకు సమాచారం అందించని ఆరెంజ్ ట్రావెల్స్ ఆపరేషన్స్ మేనేజర్ చెప్పారు. ఒకే కుటుంబానికి చెందిన వారు ఈ ప్రమాదంలో మరణించడంతో విషాదం నెలకొంది. 

ఇవాళ ఉదయం కర్ణాటక రాష్ట్రంలోని కలబురిగి వద్ద శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. కలబురిగి జిల్లా కమలాపురా పట్టణ శివార్లలో ఈ ప్రమాదం జరిగింది.  ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టెంపో ట్రాక్స్ ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగాయి.  బస్సు గోవా నుండి హైద్రాబాద్ కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని కలబురిగిలోని పలు ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదంలో 12 మందిని రక్షించారు. ఈ ఘటనలో చనిపోయిన వారు హైద్రాబాద్ కు చెందినవారుగా అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్ సహా 35 మంది ఉన్నారుహైద్రాబాద్ కు చెందిన ఐటీ ఉద్యోగి అర్జున్ తన కూతురు బర్త్ డే వేడుకలకు గాను బంధువులు, స్నేహితులతో కలిసి గోవా వెళ్లినట్టుగా సమాచారం. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు.ఈ ఘటనలో మరణించిన వారిని అర్జున్, సరళ, శివకుమార్, రవళి, దీక్షిత్,అర్జున్, అనితతో మరొకరు మరణించారు. బస్సులోని 35 మందిలో ఒకే కుటుంబానికి చెందిన వారు 25 మంది ఉన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios