MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విష్ణు ప్రియ కళ్లు తెరిపించిన శ్రీముఖి, పృధ్వీ కి వార్నింగ్, ఫినాలే టికెట్ ఎవరిసొంతమంటే..?

విష్ణు ప్రియ కళ్లు తెరిపించిన శ్రీముఖి, పృధ్వీ కి వార్నింగ్, ఫినాలే టికెట్ ఎవరిసొంతమంటే..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఫినాలే రేస్ కు ఎండ్ కార్డ్ పడింది. అంతే కాదు హౌస్ లో కొంత మందికి జ్ఞానోదయం కూడా అయ్యింది. ఇంతకీ విషయం ఏంటంటే..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 29 2024, 11:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇంకా రెండు వారాలే ఉంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈరెండు వారాలు ప్రతీ రోజు స్పెషల్ అనే చెప్పాలి. ప్రత్యేకంగా టాస్క్ లు.. ఎవరో ఒక గెస్ట్ లు.. వీకెండ్ లో సందడి వాతావరణంతో పాటు.. మరెన్నో అద్భుతాలు కనిపిస్తుంటాయి. ఇక ప్రస్తుతం ఈ వీక్ లో ఫినాలే రేస్ జరిగింది. టికెట్ టు ఫినాలే.. టాప్ 5 లో ఒక సీటు ముందుగానే టాస్క్ లు ఆడి రిజర్వ్ చేసుకోవడం. ఇక ఫైనల్ ఫినాలే రేస్ నలుగురి మధ్య జరిగింది. 

Also Read: సమంత ఆస్తి నాగ చైతన్య కాబోయే భార్య శోభిత కంటే ఎన్ని రెట్లు ఎక్కువ..?
 

25

ఈ గేమ్ ను ఆడించడానికి ఇంట్లోకి పాత కంటెస్టెంట్ కమ్ స్టార్ యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది. ఆమె వచ్చీ రావడంతోనేహౌస్ లో సందడి వాతావరణం నెలకొంది. అంతే కాదు ప్రత్యేంగా ఇంట్లోవారికి చికెన్ వండిపెట్టడంతో పాటు.. అందరితో కలిసిపోయి.. అందరి ఆటను విడివిడిగా అనలైజ్ చేస్తూ.. వారికి సలహాలిస్తూ.. ఆటలు ఆడిస్తూ గడిపేసింది శ్రీముఖి. 

Also Read:నాగ చైతన్య - శోభిత పెళ్లికి నాగార్జున ఇచ్చే కాస్ట్లీ గిఫ్ట్ ఏంటో తెలుసా..?

35

మరీ ముఖ్యంగా తన యాంకర్స్ గ్రూప్ కు చెందిన విష్ణు ప్రియకు కళ్లు తెరిపించిడంతో పాటు.. విష్ణు విషయంలో పృధ్వీకి వార్నింగ్ కూడా ఇచ్చింది శ్రీముఖి. విష్ణు ప్రియ తను చేస్తున్న పొరపాటు ఏంటో వివరంగా చెప్పింది. ఈరెండు వారాలు నువ్వు నీకోసం ఆడు.. నీకు ఇష్టమైన వాళ్ళకు నీ సపోర్ట్ అవసరం లేదు. బట్ నీకోసం చూసేజనాలు ఉంటారు కదా... వారి కోసం ఆడు అంటూ విష్ణుకు బయట ఏమనకుంటున్నారు అనే విషయాన్ని క్లారిటీ ఇచ్చింది శ్రీముఖి.

అంతే కాదు ఒక టైమ్ చూసుకుని పృధ్వీకి కూడా విష్ణు విషయంలో నువ్వు చేసేది కరెక్ట్ కాదు అనిచెప్పింది. దూరంగా ఉండాలి అనుకుంటూనే దగ్గర అవుతున్నారు అంటూ తనదైన స్టైల్ లో క్లాస్ పీకడంతో పాటు.. వార్నింగ్ కూడా ఇచ్చింది. 

Also Read:సుకుమార్ ను మోసం చేసిన స్టార్ హీరో, సినిమా చేస్తానని హ్యాండిచ్చినది ఎవరో తెలుసా..?

45

ఇక టికెట్ టు ఫినాలు రేసులో గత మూడు రోజులుగా జరుగుతున్న టాస్క్ లలో కంటెండర్స్ గా నిలిచిన రోహిణి, అవినాశ్, నిఖిల్ తో పాటు.. తేజ ను కూడా కంటెండర్ గా అవకాశాం ఇచ్చారు. కాని మొదటి రౌండ్ లోనే తేజ్ ఓడిపోయి వెనుదిరగాల్సి వచ్చింది. ఇక రోహిణి, అవినాశ్, నిఖిల్ ముగ్గురు టికెట్ టు ఫినాలే రేసులో ఫైనల్ టాస్క్ లో పాల్గొన్నారు. ఈటాస్క్ లో నిఖిల్ గెలవబోతున్నాడు అనుకున్న టైమ్ కు ఫైనల్ రౌండ్ లో బ్రిక్స్ పడిపోవడంతో అవినాశ్ టికెట్ టు ఫినాలే విజేతగా నిలిచాడు. 
 

55

ఈలోపు టాస్క్ లలో గొడవలు తప్పలేదు. ఫస్ట్ టాస్క్ లోనే రోహిణితో అవినాశ్ పోవాదనకు దిగడంతో పాటు వితండవాదం చేశాడు. ఇక మరో విషయం ఏంటంటే.. టికెట్ టు ఫినాలే గెలిచినా కూడా అవినాశ్ ఇంకా డేంజర్ జోన్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం కనిపిస్తోంది. అందులో అవినాశ్ కు చాలా తక్కువ ఓటింగ్ పడనట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి. వీకెండ్ రానే వచ్చింది. ఇంకా రెండు వారాలే ఉంది. సో ఈ వారం బయటకు వెళ్ళేది ఎవరో చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి, రష్మీ ఫోన్ నంబర్స్ యంగ్ హీరో ఏమని సేవ్ చేసుకున్నాడో తెలుసా.. అది మాత్రం నెక్స్ట్ లెవల్
Recommended image2
Asha Bhosle: 16 ఏళ్లకే ప్రేమ,పెళ్లి.. అత్తింట్లో నరకం చూసిన ఆశా భోస్లే.. ఎలా బయటపడింతో తెలుసా?
Recommended image3
Asha - RD Burman Love Story : బాలీవుడ్ సంగీత రూపురేఖలు మార్చేసిన ఆశా బర్మన్ ప్రేమకథ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved