Asianet News TeluguAsianet News Telugu

డ్రగ్స్‌ టెస్ట్‌కి రెడీ.. రక్తం, కిడ్నీలేంటీ బొచ్చు కూడా ఇస్తా : బండి సంజయ్‌కి కేటీఆర్ సవాల్

తాను బ్లడ్ టెస్ట్‌కి రెడీ అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కి సవాల్ విసిరారు కేటీఆర్. క్లీన్‌చిట్‌తో బయటకు వస్తానని... మరి కరీంనగర్‌లో బండి సంజయ్ తన చెప్పుతో తాను కొట్టుకుంటాడా అని మంత్రి సవాల్ విసిరారు.

minister ktr challenge to telangana bjp chief bandi sanjay
Author
First Published Dec 20, 2022, 5:30 PM IST

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కి కౌంటరిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. డ్రగ్స్ టెస్ట్ కోసం తన రక్తం, కిడ్నీ, బొచ్చు కూడా ఇస్తానని సవాల్ విసిరారు. తాను ఇక్కడే వుంటానని, డాక్టర్లను తీసుకురావాలని కేటీఆర్ పేర్కొన్నారు. క్లీన్‌చిట్‌తో బయటకు వస్తానని... మరి కరీంనగర్‌లో బండి సంజయ్ తన చెప్పుతో తాను కొట్టుకుంటాడా అని మంత్రి సవాల్ విసిరారు. బండి సంజయ్ మనిషా, పశువా అని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

Also Read: నేను పొగాకు నములుతానా.. కేటీఆరే డ్రగ్స్‌కు బానిస, ఏ టెస్ట్‌కైనా రెడీ : బండి సంజయ్ సవాల్

కాగా.. కొద్దిరోజుల క్రితం కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. తనకు పొగాకు నమిలే అలవాటు వుందంటూ చేసిన వ్యాఖ్యలకు సంజయ్ కౌంటరిచ్చారు. కేటీఆర్‌కు డ్రగ్స్ సేవించే అలవాటు వుందని, దమ్ముంటే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. ఈ ట్విట్టర్ టిల్లు తాను పొగాకు నములుతానని అంటున్నాడని.. ఇది అబద్ధమన్నారు. కేటీఆర్ డ్రగ్స్‌కు బానిస అని సంజయ్ ఆరోపించారు. తాను తన శరీరంలో రక్తం సహా ఏ శాంపిల్‌ అయినా టెస్టుల కోసం ఇవ్వడానికి సిద్ధమని ఆయన ప్రకటించారు. మరి తనలాగే కేటీఆర్ కూడా పరీక్షలకు సిద్ధమా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. అంతేకాకుండా హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసులను మరోసారి తిరగతోడాలని ఆయన డిమాండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios