IPL 2024 Points Table: లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ లో 166 పరుగుల టార్గెట్ ను కేవలం 9.4 ఓవర్లలో అద్భుతమైన ఛేజింగ్ తో దుమ్మురేపింది సన్‌రైజర్స్ హైదరాబాద్. దీంతో ఐపీఎల్ 2024లో ప్లేఆఫ్ అర్హత సాధించాలనే ముంబై ఇండియన్స్ ఆశలపై దెబ్బ‌ప‌డింది.  

IPL 2024 Points Table: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజ‌న్ 57వ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన హైదరాబాద్ జ‌ట్టు మరో చిరస్మరణీయ విజ‌యాన్ని అందుకుంది. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఉంచిన 166 ప‌రుగుల టార్గెట్ ను ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు దుమ్మురేపే బ్యాటింగ్ తో హైద‌రాబాద్ జ‌ట్టు కేవ‌లం 9.4 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది. హైదరాబాద్ ఓపెనర్లు ఆరంభం నుంచి లక్నో బౌలర్లపై విరుచుకుప‌డ్డారు. ఫోర్లు, సిక్స‌ర్ల వ‌ర్షం కురిపిస్తూ ల‌క్నో బౌలింగ్ ను చెడుగుడు ఆడుకున్నారు. దీంతో హైద‌రాబాద్ జ‌ట్టు ల‌క్నో పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

ఈ విజ‌యంలో హైద‌రాబాద్ జ‌ట్టు ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ను వెనక్కి నెట్టింది. ఇప్ప‌టివ‌ర‌కు 12 మ్యాచ్ ల‌ను ఆడిన హైద‌రాబాద్ జ‌ట్టు 7 విజ‌యాల‌తో 14 పాయింట్లు సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్-3 లో కొన‌సాగుతోంది. మొద‌టి రెండు స్థానాల్లో కోల్ క‌తా, రాజ‌స్థాన్ జ‌ట్లు ఉన్నాయి. ఈ రెండు జ‌ట్ల‌కు 16 పాయింట్లు ఉన్నాయి. కేవ‌లం ర‌న్ రేటు తేడాతోనే టాప్ ప్లేస్ మారింది. మరోవైపు హైదరాబాద్ విజయంతో ఈ సీజన్లో ప్లేఆఫ్ అర్హత సాధించాలన్న ముంబై ఇండియన్స్ ఆశలకు తెరపడింది. ముంబై చేతిలో కేవలం ఎనిమిది పాయింట్లు, మూడు లీగ్ దశ మ్యాచ్లు మాత్రమే ఉన్న హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఐపీఎల్ 2024లో టాప్ 4లో నివ‌డం అసాధ్యం. దీంతో మ‌రోసారి ముంబైకి నిరాశ త‌ప్ప‌లేదు.

అంపైర్ తో ఫైట్.. సంజూ శాంసన్‌కు షాకిచ్చిన బీసీసీఐ

TeamsMWLDPointsNRR
KKR11830161.453
RR11830160.476
SRH12750140.406
CSK11650120.7

IPL 2024 : చ‌రిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్..