IPL 2024 : చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్..
IPL 2024, SRH vs LSG : ఐపీఎల్ 2024 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో విజయంతో ప్లేఆఫ్ రేసుకు దగ్గరైంది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 166 పరుగుల టార్గెట్ ను అందుకుని ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది.
SRH vs LSG : ఐపీఎల్ 2024 57వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ - లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. లక్నో సూపర్ జెయింట్ ఉంచిన 166 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 58 బంతుల్లోనే సాధించింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తుఫాను బ్యాటింగ్ దెబ్బకు లక్నో బౌలింగ్ చిత్తైంది. ఈ మ్యాచ్ లో ముందుగా కేఎల్ రాహుల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. లక్నో జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. 166 పరుగులతో ఛేజింగ్ కు దిగిన సన్‌రైజర్స్ 9.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 167 పరుగులతో అద్భుత విజయాన్ని అందుకుంది. ట్రావిస్ హెడ్ (89 పరుగులు), అభిషేక్ శర్మ (75 పరుగులు)లు సూపర్ ఇన్నింగ్స్ తో అదరగొట్టారు.
ఊచకోత అంటే ఇదే.. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు షేక్ చేశారు
10 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ పై అద్భుత విజయాన్ని అందుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలో మరో రికార్డును నమోదుచేసింది. హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల సునామీ ఇన్నింగ్స్ తో హైదరాబాద్ జట్టు 9.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 166 పరుగుల టార్గెట్ ను ఛేదించింది. దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత వేగంగా 160+ పరుగులు టార్గెన్ ను అందుకున్న జట్టుగా హైదరాబాద్ రికార్డు సృష్టించింది. అలాగే, 10 ఓవర్లలోనే అత్యధిక పరుగులు చేసిన జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఘనత సాధించింది. ఆ తర్వాతి రెండు స్థానాల్లో కూడా 158, 148 పరుగులతో హైదరాబాద్ జట్టు ఉంది.
ఐపీఎల్ లో మొదటి 10 ఓవర్ల తర్వాత అత్యధిక స్కోర్లు:
167/0 (9.4) హైదరాబాద్ vs లక్నో, హైదరాబాద్ 2024 *
158/4 హైదరాబాద్ vs ఢిల్లీ, ఢిల్లీ 2024
148/2 హైదరాబాద్ vs ముంబై, హైదరాబాద్ 2024
141/2 ముంబై vs హైదరాబాద్, హైదరాబాద్ 2024
మాటలు రావడం లేదు.. సన్ రైజర్స్ విధ్వంసంతో బిత్తరపోయిన కేఎల్ రాహుల్