Asianet News TeluguAsianet News Telugu

నేను పొగాకు నములుతానా.. కేటీఆరే డ్రగ్స్‌కు బానిస, ఏ టెస్ట్‌కైనా రెడీ : బండి సంజయ్ సవాల్

మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కేటీఆర్‌కు డ్రగ్స్ సేవించే అలవాటు వుందని, దమ్ముంటే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సవాల్ విసిరారు.

telangana bjp chief bandi sanjay challenge to minister ktr over drugs issue
Author
First Published Dec 7, 2022, 4:22 PM IST

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. తనకు పొగాకు నమిలే అలవాటు వుందంటూ చేసిన వ్యాఖ్యలకు సంజయ్ కౌంటరిచ్చారు. కేటీఆర్‌కు డ్రగ్స్ సేవించే అలవాటు వుందని, దమ్ముంటే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. ఈ ట్విట్టర్ టిల్లు తాను పొగాకు నములుతానని అంటున్నాడని.. ఇది అబద్ధమన్నారు. కేటీఆర్ డ్రగ్స్‌కు బానిస అని సంజయ్ ఆరోపించారు. తాను తన శరీరంలో రక్తం సహా ఏ శాంపిల్‌ అయినా టెస్టుల కోసం ఇవ్వడానికి సిద్ధమని ఆయన ప్రకటించారు. మరి తనలాగే కేటీఆర్ కూడా పరీక్షలకు సిద్ధమా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. అంతేకాకుండా హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసులను మరోసారి తిరగతోడాలని ఆయన డిమాండ్ చేశారు. 

అంతకుముందు సోమవారం బండి సంజయ్ మాట్లాడుతూ.. సీబీఐ విచారణకు వెళ్తే అరెస్ట్  చేస్తారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భయం పట్టుకుందన్నారు. సీబీఐ విచారణకు హాజరుకాకుండా  ఉండేందుకు  కవిత  స్కెచ్  వేస్తున్నారని  ఆయన  ఆరోపించారు. విచారణకు ఎందుకు పోతానని  కవిత  అంటే ఊరుకోరన్నారు. తనకు సంబంధం  లేకపోతే కవిత విచారణకు హాజరు కావాలని బండి సంజయ్ సూచించారు.

Also REad:అరెస్ట్ చేస్తారని కవితకు భయం పట్టుకుంది: ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ సంచలనం

37 మంది  ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి  ప్రతిపక్షాలను, ప్రజాస్వామ్యాన్ని కూల్చింది కేసీఆరేనని  బండి  సంజయ్  గుర్తుచేశారు. కేసీఆర్  చేస్తే  సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారమా  అని  బండి  సంజయ్ ప్రశ్నించారు. తమ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలే ఉన్నారన్నారు. అలాంటిది  ప్రభుత్వాన్ని ఎలా  కూలుస్తామని  బండి సంజయ్ ప్రశ్నించారు.  కేసీఆర్ కు వ్యతిరేకంగా  57 మంది  టీఆర్ఎస్  ఎమ్మెల్యేలున్నారని  బండి సంజయ్  చెప్పారు. అందుకే సీఎం భయపడుతున్నారని  ఆయన దుయ్యబట్టారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios