Asianet News TeluguAsianet News Telugu

సీట్ల లొల్లి తేలేటట్లు లేదు, బయటకు వచ్చేసిన కోదండరామ్

టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ఏర్పాటైన మహాకూటమి ఎన్నికల వరకు నిలబడుతుందా అన్న సందేహం నెలకొంది. ఎన్నికలకు సరిగ్గా నెలరోజులు కూడా లేదు అయినా ఇప్పటికీ సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కిరాలేదు. అదిగో తేలుస్తాం ఇదిగో తేలుస్తాం అంటూ రోజులు నెట్టుకొస్తున్నారే తప్ప సీట్ల సర్దుబాటును ఓ కొలిక్కితెచ్చిన పరిస్థితి కనబడటం లేదు.

mahakutami seats issue, no clarity
Author
Hyderabad, First Published Nov 5, 2018, 9:13 PM IST

హైదరాబాద్: టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ఏర్పాటైన మహాకూటమి ఎన్నికల వరకు నిలబడుతుందా అన్న సందేహం నెలకొంది. ఎన్నికలకు సరిగ్గా నెలరోజులు కూడా లేదు అయినా ఇప్పటికీ సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కిరాలేదు. అదిగో తేలుస్తాం ఇదిగో తేలుస్తాం అంటూ రోజులు నెట్టుకొస్తున్నారే తప్ప సీట్ల సర్దుబాటును ఓ కొలిక్కితెచ్చిన పరిస్థితి కనబడటం లేదు.

చర్చలపై చర్చలు జరుగుతున్నా ఎవరూ తగ్గడం లేదు. మహాకూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ తాము 95 స్థానాల్లో పోటీ చేస్తామని భీష్మించుకుని కూర్చోంది. అటు టీడీపీ సైతం 14 సీట్లతో సరిపెట్టుకుని మా లెక్క తేలిపోయిందంటూ సైలెంట్ గా ఉంది. 

మిగిలిన పది సీట్లు టీజేఎస్, సీపీఐ పార్టీలను పంచుకోవాలంటూ వదిలిపెట్టి చోద్యం చూస్తోంది. తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి అన్న చందంగా 10సీట్లిచ్చాం తేల్చుకోండని టీజేఎస్, సీపీఐలకు వదిలేసింది. 

ఇకపోతే సీట్ల సర్దుబాటు అంశం ఇప్పటికీ కాంగ్రెస్ తేల్చకపోవడంతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తాము పోటీ చెయ్యాలనుకున్న తొమ్మిది స్థానాలను ప్రకటించారు. మహాకూటమి ఏర్పాటు నుంచి తొమ్మిది సీట్లు అడుగుతున్న సీపీఐ ఎట్టకేలకు నాలుగు స్థానాల వరకు దిగింది. 

అయినా కాంగ్రెస్ మూడు సీట్లే ఇస్తామని చెప్పడంతో అసహనం వ్యక్తం చేసింది. ఉదయం తాము పోటీ చేసే 9 స్థానాలు ప్రకటించిన చాడ మూడురోజుల్లోగా కాంగ్రెస్ నిర్ణయం ప్రకటించకపోతే అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికల ప్రచారానికి వెళ్తామని డెడ్ లైన్ విధించారు. 

ఇకపోతే తాజా పరిస్థితులు, సీట్ల సర్దుబాటు అంశాలపై పార్క్ హయత్‌లో మహాకూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీపీఐ, టీడీపీ నేతలు హాజరుకాలేదు. కాంగ్రెస్ తరపున పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ మాత్రమే హాజరయ్యారు. 

తమకు సీట్లపై స్పష్టత వచ్చిన నేపథ్యంలోనే సమావేశానికి రాలేదని టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ స్పష్టం చేశారు. సీట్లు కన్ఫమ్ అయిపోయాయని అభ్యర్థు ప్రకటన దీపావళి తర్వాత వెళ్లడిస్తామంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాత్రం తమకు ఆహ్వానం అందలేదని చెప్పారు. అందువల్లే సమావేశానికి వెళ్లలేదన్నారు.  

కాంగ్రెస్ టీజేఎస్ ల మధ్య జరిగిన చర్చల్లో మధ్యలోనే టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఇచ్చిందని తమ పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామంటూ కోదండరామ్ వెళ్ళిపోయారు. 

మరోవైపు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో చర్చలు ఫలప్రదంగా ముగిసాయని ఆయన చర్చల అనంతరం బయటకు వెళ్లారే తప్ప మధ్యలో వెళ్లలేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.  నేటి సాయంత్రం లేదా బుధవారం లోపు సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కివస్తుందన్నారు. మహాకూటమితోనే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు.
 
కూటమి నుంచి ఎవరూ బయటకు వెళ్లడంలేదని ఉత్తమ్ తెలిపారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంతో భేటీ అయిన తర్వాత కూటమి అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. కూటమిలో ఏం జరగలేదని అంతా కలిసే ఉన్నామని తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్

కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

Follow Us:
Download App:
  • android
  • ios