MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • IMD Rain Alert : భారీ వర్షాలు, వడగళ్లు, పిడుగులు, ఈదురుగాలులు.. ఇక ఈ జిల్లాల్లో అల్లకల్లోలమే

IMD Rain Alert : భారీ వర్షాలు, వడగళ్లు, పిడుగులు, ఈదురుగాలులు.. ఇక ఈ జిల్లాల్లో అల్లకల్లోలమే

Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండ్రోజులు వర్షాలు  మరింత జోరందుకోనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ వర్షాలకు ఈదురుగాలులు, పిడుగులు, వడగళ్లు, ఉరుములు మెరుపులు తోడవడంతో ప్రమాదకరంగా మారతాయని హెచ్చరించింది.

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 19 2026, 12:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు..
Image Credit : Gemini AI

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు..

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి... మరో రెండుమూడు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కేవలం సాధారణ వర్షాలు కురిస్తే పరవాలేదు కానీ అక్కడక్కడ వడగళ్ల వానలు పడుతున్నాయి... అలాగే ఉరుములు మెరుపులు, పిడుగుల ప్రమాదం కూడా పొంచివుంది… కాబట్టి ఈ వర్షాలు ముగిసేవరకు తెలుగు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

26
ఈ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
Image Credit : Asianet News

ఈ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..

తెలంగాణలో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంది... ఇవాళ (మార్చి 19, గురువారం) సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, వడగండ్ల వానలు పడే ఛాన్సెస్ ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అలాగే 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు కూడా ఉన్నాయంటోంది. అందుకే ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మిగతా జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి... దీంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

Related Articles

Related image1
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు.. అత్యధిక వర్షపాతం నమోదైన టాప్ 10 ప్రాంతాలివే..
Related image2
IMD Rain Alert: వ‌చ్చే రెండు రోజులు భారీ వ‌ర్షాలు.. ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ
36
ఈ సాయంత్రం తస్మాత్ జాగ్రత్త...
Image Credit : X/APSDMA

ఈ సాయంత్రం తస్మాత్ జాగ్రత్త...

ఇక ఇవాళ హైదరాబాద్ లో ఆకాశం మేఘాలతో కమ్ముకుని ఉంటుందని... సాయంత్రం లేదా రాత్రివేళల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయట.  ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయి కాబట్టి నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. 

46
ఈ తెలంగాణ జిల్లాలో వర్షాలు
Image Credit : Gemini AI

ఈ తెలంగాణ జిల్లాలో వర్షాలు

రేపు (మార్చి 20, శుక్రవారం) ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులు, ఈదురుగాలు వర్షాలు కురిసే అవకాశాలున్నాయట... అందుకే ఈ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

56
ఏపీపై ద్రోణి ఎఫెక్ట్... వర్షాలే వర్షాలు
Image Credit : Gemini AI

ఏపీపై ద్రోణి ఎఫెక్ట్... వర్షాలే వర్షాలు

ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే రానున్న మూడు రోజులు ఓవైపు ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ద్రోణి, నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో ఇవాళ (మార్చి 19, గురువారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఈ జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

66
ఈ జిల్లాల్లో వర్షాలు
Image Credit : X/APSDMA

ఈ జిల్లాల్లో వర్షాలు

ఇక విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తు సంస్థ తెలిపింది. ఆకస్మిక వర్షాలతో పడే పిడుగుపాటుపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. చెట్ల క్రింద నిలబడరాదని సూచించింది. వర్షాలు కురిసే సమయంలో బయటకు వెళ్లకూడదని హెచ్చరించింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
విజయవాడ
విశాఖపట్నం
తిరుపతి
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Viral Video: ఇది చ‌దువుకున్న వాళ్లు చేసే ప‌నేనా.. రోడ్ల‌పై క్వ‌శ్చ‌న్ పేప‌ర్లు చించి ప‌డేయడం ఏంటి.?
Recommended image2
IMD Rain Alert: వ‌చ్చే రెండు రోజులు భారీ వ‌ర్షాలు.. ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ
Recommended image3
Now Playing
Sudden Rains in Hyderabad:హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు | Weather Update| Asianet News Telugu
Related Stories
Recommended image1
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు.. అత్యధిక వర్షపాతం నమోదైన టాప్ 10 ప్రాంతాలివే..
Recommended image2
IMD Rain Alert: వ‌చ్చే రెండు రోజులు భారీ వ‌ర్షాలు.. ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved