మిర్యాలగూడలో తన అభిష్టానికి వ్యతిరేకంగా కూతురిని పెళ్లి చేసుకున్నాడనే అక్కసుతో మామ కక్షకు బలైన ప్రణయ్ హత్యను తెలంగాణ మంత్రి కేటీఆర్ ఖండించారు.
మిర్యాలగూడలో తన అభిష్టానికి వ్యతిరేకంగా కూతురిని పెళ్లి చేసుకున్నాడనే అక్కసుతో మామ కక్షకు బలైన ప్రణయ్ హత్యను తెలంగాణ మంత్రి కేటీఆర్ ఖండించారు. ఈ సంఘటన నన్ను షాక్‌కు గురిచేసింది.. నేటికాలంలోనూ కులం ఇంకా దారుణాలకు పురొగొల్పేలా చేయడం చూసి చాలా కోపంగా ఉంది. ఇంతటి దారుణానికి పాల్పడిన వారికి ఖచ్చితంగా శిక్షపడుతుంది.. అమృత, ప్రణయ్ తల్లిదండ్రులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ట్వీట్ చేశారు.
మరోవైపు ప్రణయ్ భౌతికకాయానికి అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. అతని నివాసం నుంచి శ్మశాన వాటికకు ప్రణయ్ మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకువెళుతున్నారు. అంత్యక్రియల్లో కుటుంబసభ్యులు, స్థానికులు, దళిత, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. అంతకు ముందు ఉక్రెయిన్ నుంచి వచ్చిన అతని సోదరుడు ప్రణయ్ భౌతికకాయాన్ని చూడగానే కన్నీరుమున్నీరయ్యాడు. తల్లిదండ్రులను, వదినను ఓదార్చాడు.
మాతోనే అన్ని విషయాలు షేర్ చేసుకొనేవాడు: ప్రణయ్ స్నేహితులు
మారుతీరావు ఓ సైకో, అతడిని వాళ్లే చంపుతారు: ప్రణయ్ సోదరుడు అజయ్
కిడ్నాప్ చేసినవాడితోనే ప్రణయ్ హత్యకు ప్లాన్?
నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్
'చచ్చేవరకైనా కలిసుందాం', బెదిరించేవారు: అమృతవర్షిణీ
ప్రణయ్ హత్య: అబార్షన్ చేసుకోవాలని నాన్న ఒత్తిడి: అమృతవర్షిణీ
అమ్మ కంటే ప్రణయ్ బాగా చూసుకొన్నారు: అమృతవర్షిణీ
ప్రణయ్ హత్య: నాడు కిరోసిన్ దందా.. నేడు బిల్డర్, ఎవరీ మారుతీరావు?
ప్రణయ్ హత్య: 3 రోజుల ముందే ఇంటి వద్దే రెక్కీ
ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...
