Asianet News TeluguAsianet News Telugu

అశ్లీల వెబ్ సైట్ లో యువతి నెంబర్, నగ్నంగా వీడియో కాల్.. చివరకు

అందమైన అమ్మాయిలతో చాటింగ్‌, వీడియోకాలింగ్‌, ఫొటోల కోసం సంప్రదించాలని అందులో ఉండడంతో ఫోన్‌ చేశాడు. అవతలి వైపు నుంచి ఓ యువతి వలపు వల విసురుతూ మాట్లాడింది.

hyderabad youth loses Rs 80k in online fraud
Author
Hyderabad, First Published May 8, 2020, 9:32 AM IST

ప్రస్తుతం కరోనా వైరస్  కారణంగా దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఉద్యోగులంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అయితే... ఓ ఉద్యోగి ఇంటి దగ్గర నుంచి పనిచేస్తూనే... మధ్య మధ్యలో అశ్లీల వెబ్ సైట్లు వీక్షించేవాడు. అందులో అతనికి ఓ యువతి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం నగ్నంగా వీడియో కాల్స్ చేసుకునేదాకా వెళ్లింది. చివరకు తాను ఎంత ఘోరంగా మోసపోయానో యువకుడు ఆలస్యంగా తెలుసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే నగరానికి చెందిన ఓ యువకుడు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి పెళ్లి కాలేదు. ఖాళీ సమయంలో అశ్లీల వీడియోలు చూసేవాడు. ఓ వెబ్‌సైట్లో ఫోన్‌ నంబర్‌ కనబడింది. 

అందమైన అమ్మాయిలతో చాటింగ్‌, వీడియోకాలింగ్‌, ఫొటోల కోసం సంప్రదించాలని అందులో ఉండడంతో ఫోన్‌ చేశాడు. అవతలి వైపు నుంచి ఓ యువతి వలపు వల విసురుతూ మాట్లాడింది. ఆమె మాటలకు ఫిదా అయ్యాడు. తన ఫొటోలు కావాలన్నాడు. అందుకు డబ్బు చెల్లించాడు.

ఉత్సాహాన్ని ఆపుకోలేక వీడియో కాలింగ్‌లో మాట్లాడాలన్నాడు. ఆ యువతి అంగీకరించడంతో వీడియో కాల్‌ మాట్లాడాడు. అతడు ఒంటిపై దుస్తులు లేకుండా వీడియో కాల్స్‌ మాట్లాడిన సందర్భాలున్నాయి. వాటిని క్యాప్చర్‌ చేసిన సైబర్‌ కేటుగాళ్లు బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించారు. 

అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియో కాల్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో పెడతామని బెదిరించారు. భయపడిన సురేష్‌ ముందుగా రూ. 20 వేలు చెల్లించాడు. దశలవారీగా అతడి నుంచి రూ. 80 వేలు కాజేశారు. ఆ తర్వాత సురేష్‌ స్పందించకపోవడంతో ఆ ఫొటోలను అతడి ఖాతాతో ట్యాగ్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పెట్టారు. బాధితుడు సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కాగా.. పోలీసులు అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios