హైద్రాబాద్ డ్యాన్సర్ న్యూడ్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు: పోలీసుల అదుపులో ఫిట్‌నెస్ ట్రైనర్
హైద్రాబాద్ నగరంలో ఓ డ్యాన్సర్ న్యూడ్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు ఫిట్ నెట్ ట్రైనర్. దీంతో బాధితురాలు పిట్ నెస్ ట్రైనర్ పై ఫిర్యాదు చేసింది.మహారాష్ట్రలో ఉన్న ఫిట్ నెస్ ట్రైనర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: నగరంలోని Panjagutta పోలీస్ స్టేషన్ పరిధిలో Dancer Nude వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫిట్ నెస్ ట్రైనర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.హైద్రాబాద్ లో ఉండే ఓ డ్యాన్సర్ కి, ఫిట్ నెనస్ ట్రైనర్ కు మధ్య కొంత కాలంగా పరిచయం ఉంది. ఈ పరిచయం వీరిద్దరి మధ్య సాన్నిహిత్యానికి దారి తీసింది. తాము ఇద్దరం సన్నిహితంగా ఉన్న సమయంలో డ్యాన్సర్ కు తెలియకుండా పిట్‌నెస్ ట్రైనర్ రహస్యంగా ఫోటోలు, Videos తీశాడు.
ఈ వీడియోలను పిట్‌నెస్ ట్రైనర్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ విషయం డ్యాన్సర్ దృష్టికి వచ్చింది. దీంతో ఆమె పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ పిర్యాదు ఆధారంగా పోలీసులు ఫిట్‌నెస్ ట్రైనర్ ను మహారాష్ట్రలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిట్ నెస్ ట్రైనర్ ను పోలీసులు హైద్రాబాద్ కు తీసుకు వస్తున్నారని తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ ప్రసారం చేసింది.
also read:పదేళ్ల బాలికను సులభ్ కాంప్లెక్స్ లోకి తీసుకెళ్లి అత్యాచారం.
గతంలో కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదయ్యాయి.గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లు గ్రామానికి చెందిన కడియం రాజేష్ కు ఫేస్ బుక్ లో ఓ అపరిచిత యువతినుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అయితే అమ్మాయి నుండి రిక్వెస్ట్ రావడంతో అతడు యాక్సెప్ట్ చేశాడు. అతడితో చాటింగ్ చేసి పరిచయం పెంచుకున్న యువతి మొబైల్ నెంబర్ సేకరించింది.
ఆ తర్వాత రాజేష్ కు ప్రతిరోజూ ఫోన్ చేసి మాట్లాడుతూ మరింత దగ్గరయ్యింది. పూర్తిగా ఆమె మాటల మాయలో పడిపోయిన ఆమె ఏం చెబితే అది చేయసాగాడు. ఈ క్రమంలోనే వీడియో కాల్ చేసిన యువతి ఇద్దరం న్యూడ్ గా మారి ముచ్చటిద్దామని కోరింది. మొదట యువతి న్యూడ్ గా మారడంతో రాజేష్ కూడా ఏమాత్ర ఆలస్యం చేయకుండా నగ్నంగా ఆమెతో ముచ్చటించాడు.
ఈ న్యూడ్ వీడియో కాల్ ను తర్వాతే అసలు కథ మొదలయ్యింది. అప్పటివరకు మాయమాటలతో మభ్యపెట్టిన యువతి తన అసలురూపాన్ని బయటపెట్టింది. నగ్నంగా మాట్లాడిన వీడియోను చూపించి రాజేష్ ను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. తాను అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వకపోతే నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు దిగింది.
మొదట ఆమె బెదిరింపులకు భయపడిన రాజేష్ కొంతసొమ్మును ముట్టజెప్పాడు. అయినప్పటికి యువతి వేధింపులు ఆగకపోవడంతో ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించాడు. తన నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని యువతి బెదిరిస్తోందంటూ మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన 2021 డిసెంబర్ 2న చోటు చేసుకుంది.
తెలంగాణలోని హైదరాబాద్ లోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. నగరంలోని హిమాయత్ నగర్ కు చెందిన యువకుడికి ఓ వ్యక్తి అందమైన అమ్మాయిలా వాట్సప్ లో పరిచయం అయ్యాడు. సాంకేతికతను అడ్డంపెట్టుకుని పలుమార్లు అమ్మాయి వాయిస్ తో మాట్లాడాడు. అమ్మాయిలా మాట్లాడుతూ యువకుడిని రెచ్చగొట్టి న్యూడ్ గా వీడియో కాల్ చేసేలా చేసాడు. ఆ వీడియో రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ ప్రారంభించాడు.
డబ్బులు ఇవ్వకపోతే నీ న్యూడ్ వీడియోను వాట్స్అప్ గ్రూపులో షేర్ చేయడంతోపాటు యూట్యూబ్ లో పోస్ట్ చేస్తామని బెదిరించారు. దీంతో వారు చెప్పిన విధంగా ఈ యువకుడు పలు దఫాలుగా ఇప్పటివరకు నాలుగు లక్షల రూపాయలు పంపాడు. ఎన్ని డబ్బులిచ్చినా బెదిరింపులు ఆగకుండా మరిన్ని డబ్బులు కావాలని వేధిస్తుండడంతో బాధిత యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.