Asianet News TeluguAsianet News Telugu

Harishrao: 'ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి'.. కేంద్రమంత్రికి మంత్రి హరీశ్ లేఖ  

Harish Rao: మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయనున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు.

harishrao wrote letter to union minister rajnath singh over ordnance factory privatization  KRJ
Author
First Published Apr 22, 2023, 5:02 PM IST

Harishrao: మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కోరారు. ఈ మేరకు కేంద్రరక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ రాశారు. దేశ రక్షణ రంగంలో మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కీలక పాత్ర పోషిస్తుందని, ఇలాంటి ఫాక్టరీని ప్రైవేటీకరణ చేయొద్దని మంత్రి హరీశ్ విజ్ఞప్తి చేశారు. దేశ భద్రత అలాగే.. 74 వేల మంది ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ప్రైవేట్ పరం చేయాలనే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు.

మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి, సిబ్బందికి గత ఆర్థిక సంవత్సరంలో కావాల్సినంత పని ఉండేదని మంత్రి అన్నారు. దాదాపు రూ.930 కోట్ల ఆర్డర్లను సమయానికి పూర్తి చేశారని, సంస్థ సిబ్బంది ఎలాంటి సవాళ్లలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కానీ ప్రస్తుతం  సంస్థకు పని అప్పగించలేదని, దీనిని ఆధారంగా చూపించి.. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని 'సిక్ ఇండస్ట్రీ'గా ప్రకటిస్తారని కార్మికులు ఆందోళన వ్యక్తం చెందుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 25 వేల మంది భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడుతుందని అన్నారు. ఇప్పటికే డిఫెన్స్ రంగంలో ఉన్న ఏడు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా ఆయా సంస్థల మధ్య పోటీ నెలకొంటుందని, తద్వార నూతన ఆయుధాల అభివృద్ధి నిలిచిపోతుందని అన్నారు. ప్రైవేటీకరణ అనే నిర్ణయం మేకిన్ ఇండియా స్ఫూర్తిని దెబ్బతీస్తుందని మంత్రి హరీశ్ రావు తన లేఖలో పేర్కొన్నారు. అలాగే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగ ప్రతినిధులు ఇచ్చిన ఆరు డిమాండ్లను లేఖకు జత చేశారు.

ఆ ఆరు డిమాండ్లు ఇవే...

 1. రైతు చట్టాల మాదిరిగానే డిఫెన్స్ రంగా సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

2. పరిశోధన విభాగాన్ని మరింత పటిష్టం చేయాలి.

3. మిషనరీని ఆధునికరించాలి. ఉద్యోగుల నైపుణ్యం పెంపొందించుకునేలా శిక్షణ ఇవ్వాలి.

4. అలాగే.. పరిపాలన, కొనుగోలు విధానాలను సరళీకరించాలి.

5. ఇండియన్ ఆర్మీ అవసరాలకు అనుగుణంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఆర్డర్లు ఇవ్వాలి.

6. ప్రసార భారతిలో మాదిరిగానే ఉద్యోగులకు భద్రత కల్పించాలి.
 

Follow Us:
Download App:
  • android
  • ios