హైదరాబాద్: మాజీ ఎంపీ సినీనటుడు హరికృష్ణకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. బయటకు వెళ్తే తన కారుని ఆయనే స్వయంగా డ్రైవే చేసుకుని వెళ్తారు..అయితే కారు కంటే ఆయనకు రాయల్ ఎన్ ఫీల్డ్ వాహనం అంటే ప్రాణం. ఏఏయూ 2622 నంబర్ గల రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే ఆయనకు ప్రాణం. అబిడ్స్‌లోని ఆహ్వానం హోటల్‌ నిర్వహణ బాధ్యతలను చూసుకునే రోజుల్లో రాయల్ ఎన్ ఫీల్డ్ పైనే తిరిగేవారు. అబిడ్స్ రోడ్లపై చక్కెర్లు కొట్టేవారట. రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై రాజసాన్ని ఒలకబోస్తూ వెళ్లేవారని అంటుంటారు. 

హరికృష్ణ మృతితో అబిడ్స్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాయల్ ఎన్ ఫీల్డ్ పై రాజసం ఉట్టిపడేలా తిరిగే రోజులను అభిమానులు గుర్తు చేసుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. హరికృష్ణ మృతికి సంతాపంగా అబిడ్స్ లోని ఆహ్వానం హోటల్ పరిసర ప్రాంతాల్లోని దుకాణాలను స్వచ్చంధంగా మూసివేశారు. 

సంబంధిత వార్తలు

హరికృష్ణ: రోజులో ఎక్కువ టైమ్ 1001 రూమ్‌లోనే, ఎందుకంటే?

హరికృష్ణ నివాసానికి ఎన్టీఆర్ తల్లి, భార్య

హరికృష్ణ మోసపోయారు.. పోసాని సంచలన కామెంట్స్!

హరికృష్ణ మృతి... సమంతపై నెటిజన్ల ఫైర్

నాన్న మమ్మల్ని అలా పెంచలేదు.. తండ్రి గొప్పదనాన్ని వివరించిన ఎన్టీఆర్!

చిన్న పొరపాటుతోనే హరికృష్ణ మృతి

హైదరాబాద్ బయలుదేరిన హరికృష్ణ కుమార్తె సుహాసిని

తెలుగు భాషంటే ప్రాణమిచ్చే హరికృష్ణ...మాతృ భాషా దినోత్సవం రోజే ఇలా....

హరికృష్ణ మృతి..బోసిపోయిన అఖిలప్రియ పెళ్లి మండపం