నందమూరి వంశానికి తెలుగు భాష, తెలుగు జాతి అంటే అమితమైన ఇష్టం. ముఖ్యంగా నందమూరి తారక రామారావు తెలుగు జాతి ఆత్మగౌరవం కోసమే పార్టీని స్థాపించినట్లు పలుమార్లు వెల్లడించారు. ఆయన తన సినిమాల్లో తెలుగు భాషకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రతి డైలాగు అచ్చ తెలుగులోనే ఉండేలా ప్రత్యేక శ్రద్ద తీసుకునేవారు. ఆయన తరువాత అంతటి భాషా ప్రేమికుడిగా ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ పేరుతెచ్చుకున్నారు. దేశ పార్లమెంట్ లో కూడా తన మాతృబాష తెలుగులోనే మాట్లాడి తన భాషాభిమానంతో పాటు తెలుగు జాతి పౌరుషాన్ని చూపించారు.

హరికృష్ణ ఇవాళ తెల్లవారుజామున నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఇలా తెలుగు బాషాభిమాని అయిన హరికృష్ణ మాతృబాషా దినోత్సవం రోజే మృతిచెందడం తెలుగు బాషాభిమానులతో పాటు తెలుగు ప్రజలను తీవ్రంగా బాధిస్తోంది. తెలుగు బాషాభిమానం విషయంలో హరికృష్ణ తండ్రికి తగ్గ కొడుకుగా పేరుతెచ్చుకున్నారని నందమూరి అభిమానులు, సినీ ప్రేక్షకులు చెబుతుంటారు. 

డిల్లీకి తెలుగు జాతి, తెలుగు బాష ప్రతాపాన్ని చూపించిన వ్యక్తి ఎన్టీఆర్. తెలుగు జాతిపై డిల్లీ పెత్తనాన్ని సహించేది లేదని ఆయన పలు సభల్లో తెలిపారు. ఆయన బాటలోనే హరికృష్ణ కూడా నడిచారు. రాజ్యసభలో సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన చర్చ సందర్భంగా హరికృష్ణ అచ్చతెలుగులో మాట్లాడారు. ఆయన తన   మాతృబాషలోనే తన ఆవేదనను సభ ముందుకు తీసుకువచ్చారు. అనంతరం తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. 

ఇలా తన తండ్రి తర్వాత డిల్లీకి తెలుగు పౌరుషాన్ని చూపించిన వ్యక్తిగా హరికృష్ణ పేరు తెచ్చుకున్నారు. కానీ ఇలా అదే తెలుగు భాషా దినోత్సవం రోజే మృతి చెందడం తెలుగు ప్రజలను బాధిస్తోంది.

హరికృష్ణ మృతి..బోసిపోయిన అఖిలప్రియ పెళ్లి మండపం

తెలుగుభాషకు ప్రాధాన్యత ఇచ్చిన హరికృష్ణ

హరికృష్ణ మృతి... చంద్రబాబు కాన్వాయ్ లోనే ఆస్పత్రికి చేరుకున్న తెలంగాణ మంత్రి

హైదరాబాద్ బయలుదేరిన హరికృష్ణ కుమార్తె సుహాసిని