నందమూరి హరికృష్ణ బుధవారం తెల్లవారుజామున రోడ్డు యాక్సిడెంట్ లో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ దిగ్బ్రాంతి చెందింది

నందమూరి హరికృష్ణ బుధవారం తెల్లవారుజామున రోడ్డు యాక్సిడెంట్ లో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ దిగ్బ్రాంతి చెందింది. పలువురు సినీ ప్రముఖులు హరికృష్ణకు నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా హరికృష్ణ మరణంపై బాధను వ్యక్తం చేశారు.

తాజాగా ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఈ విషయంపై స్పందించారు. హరికృష్ణ నటించిన ఏడెనిమిది సినిమాలకు మాటలు రాసినట్లుగా గుర్తుచేసుకున్నారు పోసాని కృష్ణమురళి. ''హరికృష్ణ మోసపోవడమే తప్ప.. ఎవరినీ మోసం చేయలేదు. ఎవరినీ నాశనం చేయాలనే ఉద్దేశం ఆయనకు లేదు. నన్ను ఎంతో ఆప్యాయంగా పిలిచేవారాయన. ఎన్టీఆర్ లా స్వచ్ఛమైన వాయిస్ హరికృష్ణకే ఉంది'' అంటూ చెప్పుకొచ్చారు. 

ఇవి కూడా చదవండి.. 

హరికృష్ణ మృతి... సమంతపై నెటిజన్ల ఫైర్

నాన్న మమ్మల్ని అలా పెంచలేదు.. తండ్రి గొప్పదనాన్ని వివరించిన ఎన్టీఆర్!

ఎన్టీఆర్ విలపిస్తున్న తీరు ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది!