మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ  ఎక్కువ కాలం ఆబిడ్స్‌  ఆహ్వానం హోటల్‌‌కు మంచి అనుబంధం ఉంది.ఈ హోటల్‌ను ఎన్టీఆర్ 1960లో నిర్మించారు. 


హైదరాబాద్: మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ ఎక్కువ కాలం ఆబిడ్స్‌ ఆహ్వానం హోటల్‌‌కు మంచి అనుబంధం ఉంది.ఈ హోటల్‌ను ఎన్టీఆర్ 1960లో నిర్మించారు. 

టీడీపీ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ రోజులో ఎక్కువగా హైద్రాబాద్‌ ఆబిడ్స్‌లోని ఆహ్వానం హోటల్‌లోని 1001 రూమ్‌లో ఎక్కువగా గడిపేవాడు.ఈ రూమ్‌లో హరికృష్ణ ఉండేవాడు. ఈ రూమ్‌ను ఎవరికీ కూడ అద్దెకు ఇవ్వరు.ఈ రూమ్‌‌ను హరికృష్ణ కోసం ప్రత్యేకంగా ఉంటుంది.

హరికృష్ణను కలవాలంటే ఆహ్వానం హోటల్‌‌కు ఆయన అభిమానులు వస్తారు.ప్రతి రోజూ హరికృష్ణ ఈ హోటల్‌కు వస్తారు. హరికృష్ణను కలవాలంటే ఈ హోటల్‌కు వస్తారు. ఆహ్వానం హోటల్‌ను తన స్నేహితుడు కృష్ణారావుకు లీజుకు ఇచ్చాడు. స్నేహం కోసం పనిచేస్తాడని ఆయన స్నేహితుడు కృష్ణారావు గుర్తు చేసుకొన్నాడు.

ప్రతి రోజూ ఉదయం ఆరు గంటలకు ఆహ్వానం హోటల్‌కు వచ్చేవాడు హరికృష్ణ. నెల రోజుల క్రితమే కృష్ణకు ఈ హోటల్‌ను లీజుకు ఇచ్చాడు. అంతేకాదు ఈ హోటల్‌ను లీజుకు ఇవ్వాలని పెద్ద పెద్ద వాళ్లు ఒత్తిడి తెచ్చినా కూడ హరికృష్ణ తన మాట మీద నిలబడ్డాడు. 

మంగళవారం నాడు మధ్యాహ్నం పదకొండున్నర గంటలకు ఆహ్వానం హోటల్‌కు హరికృష్ణ వచ్చాడు. కానీ, నిజానికి ప్రతి రోజూ ఉదయం పూట ఆరు గంటలకు వచ్చేవాడు. కానీ మంగళవారం నాడు మాత్రం పదకొండున్నర గంటలకు వచ్చినట్టు కృష్ణ చెప్పాడు

కృష్ణను కష్టాలనుండి గట్టెక్కించేందుకు గాను హరికృష్ణ ఈ హోటల్‌ను లీజుకు ఇచ్చాడు. హరికృష్ణ నడిపిన కారులోనే ఆహ్వానం హోటల్‌కు చెందిన 1001 నెంబర్ తాళం చెవి కూడ ఉంది. మధ్యాహ్నం సమయంలో హరికృష్ణ ఈ హోటల్‌లోనే కొద్దిసేపు సేద తీరేవారు.

ఈ వార్తలు చదవండి

కొంపముంచిన నిర్లక్ష్యం: సీటు బెల్ట్ పెట్టుకోక చనిపోయిన ప్రముఖులు వీరే

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నందమూరి హరికృష్ణ కన్నుమూత

బాబుతో హరికృష్ణకు విబేధాలు, ఎందుకంటే?

హరికృష్ణ మృతి: మూడు రోజుల్లోనే పుట్టినరోజు.... ఇంతలోనే దుర్మరణం

నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు

రోడ్డు ప్రమాదాలతో టీడీపీకి దెబ్బ: కీలక నేతల దుర్మరణం