నాన్న మమ్మల్ని అలా పెంచలేదు.. తండ్రి గొప్పదనాన్ని వివరించిన ఎన్టీఆర్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 29, Aug 2018, 1:58 PM IST
ntr speech about harikrishna at nannaku prematho audio function
Highlights

నందమూరి హరికృష్ణ మరణవార్త ఆయన కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. ఆయన కుమారులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ల బాధను చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెడుతున్నారు

నందమూరి హరికృష్ణ మరణవార్త ఆయన కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. ఆయన కుమారులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ల బాధను చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెడుతున్నారు. కష్టసుఖాల్లో తమ వెంటే ఉండి ప్రయాణించిన తండ్రి ఇక లేరనే విషయాన్ని ఈ ఇద్దరు తనయులు భరించలేకపోతున్నారు. చివరిసారి ఆయనతో మాట్లాడే అవకాశం కూడా రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన ముగ్గురు కుమారులను హరికృష్ణ ఎంతో ప్రేమగా చూసుకునేవారు.

తన తండ్రి ఎన్టీఆర్ లా తన కొడుకులు మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన తపించేవారు. ఈ విషయాలన్నింటినీ తన సినిమా ఆడియో ఫంక్షన్ లో వెల్లడించాడు ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో తన తండ్రి గురించి గొప్పగా మాట్లాడాడు ఎన్టీఆర్. ''నా మీద నాకు నమ్మకం కలిగేలా చేసింది మా నాన్నగారు నందమూరి హరికృష్ణ గారు. నాన్న ఎప్పుడూ మా ముగ్గురికీ.. (జానకీరామ్ అన్న మా మధ్య లేకపోయినా ఆయన ఆత్మ ఇక్కడే ఉంటుందని భావిస్తాను) ఒకటే చెప్పేవారు.

కింద పది చావుదాకా వెళ్లిపోండి.. కానీ మిమ్మల్ని మీరే నమ్ముకొని పైకి రండి అన్నారు. ఏ రోజు పిరికి పందల్లా బతకడం మాకు నేర్పించలేదు. అలానే ఆయన పేరు, తాతగారి పేరు చెప్పుకొని బతికేలా ప్రోత్సహించలేదు. మీరు మీలాగా బతకండి.. మా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయని అన్నారు'' అంటూ తన తండ్రి వ్యక్తిత్వం గురించి ఎంతో గొప్పగా ప్రశంసించారు తారక్. అలాంటిది ఈరోజు తమ తండ్రి తమతో లేడని తెలిసిన విషయాన్ని భరించలేక బాధలో ఉండిపోయారు ఇద్దరు అన్నదమ్ములు.  

loader