నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముందు ‘పెద్దవారిని గౌరవించడం నేర్చుకో’ అంటూ నెటిజన్లు సమంతను తెగ ట్రోల్ చేస్తున్నారు.
సినీనటుడు, టీడీపీ సీనియర్ నేత హరికృష్ణ ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ.. సినీ ప్రముఖులంతా ట్వీట్టర్ లో పోస్టులు చేస్తున్నారు. అలా ట్వీట్ చేసినవారిలో సమంత కూడా ఉంది. కానీ.. అదే ఇప్పుడు సమంతకు చిక్కులు తెచ్చిపెట్టింది.
సంతాపం తెలిపే ట్వీట్ లో హరికృష్ణ పేరు పక్కన గారు పెట్టడం సమంత మర్చిపోయింది. దీంతో నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముందు ‘పెద్దవారిని గౌరవించడం నేర్చుకో’ అంటూ నెటిజన్లు సమంతను తెగ ట్రోల్ చేస్తున్నారు.
#RIPHarikrishnaGaru Shocked and saddened . Strength to the family in this difficult time .
— Samantha Akkineni (@Samanthaprabhu2) August 29, 2018
పొరపాటు గుర్తించిన సమంత.. దాన్ని సరిదిద్దుకునేందుకు నానాపాట్లూ పడింది. దాంతో ఆమె ముందు చేసిన ట్వీట్‌ని డిలీట్ చేసి, 'రిప్ హరికృష్ణ గారూ' అంటూ మరో ట్వీట్ చేసింది. అంతేకాక ప్రస్తుతం తాను చెన్నైలో ఉన్నానని, ఓ సినిమా ఫంక్షన్ కోసం అక్కడికి వెళ్లానని కూడా చెప్పింది. ఈ వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, కష్టకాలంలో ఆయన కుటుంబానికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పింది. కానీ అప్పటికే సమంత చేసిన రెండు ట్వీట్లు స్క్రీన్ షాట్ల రూపంలో వైరల్ అయ్యాయి.
Last Updated 9, Sep 2018, 11:40 AM IST