హరికృష్ణ నివాసానికి ఎన్టీఆర్ తల్లి, భార్య

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 29, Aug 2018, 2:17 PM IST
NTR mother and wife reached hari krishna's house
Highlights

హరికృష్ణను కడసారి చూసేందుకు ఆయన భార్య శాలిని, ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మి ప్రణతి, సోదరి పురంధేశ్వరి, ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి తదితరులు హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు

సినీ నటుడు నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణం కుటుంబసభ్యులను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా ఆయన కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. 

నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించిన అనంతరం హరికృష్ణ పార్థివదేహాన్ని మెహదీపట్నంలోని ఆయన నివాసానికి తీసుకొస్తున్నారు. హరికృష్ణను కడసారి చూసేందుకు ఆయన భార్య శాలిని, ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మి ప్రణతి, సోదరి పురంధేశ్వరి, ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి తదితరులు హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు. హరికృష్ణ నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

loader