హరికృష్ణ మృతి..బోసిపోయిన అఖిలప్రియ పెళ్లి మండపం

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 29, Aug 2018, 1:10 PM IST
akhila priya marriage marriage with out celebraties
Highlights

హరికృష్ణ మృతి..బోసిపోయిన అఖిలప్రియ పెళ్లి మండపం

ఏపీ పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ వివాహం ఈ రోజు జరిగింది. ఎంతో ఘనంగా, అట్టహాసంగా అతిరథ మహారథుల సమక్షంలో జరగాల్సిన పెళ్లి.. అకస్మాత్తుగా జరిగిన ఓ సంఘటన కారణంగా సాదాసీదాగా జరిగిపోయింది.

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పెద్ద కుమారుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ‌ హఠాన్మరణం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. నందమూరి కుటుంబం శోకసంద్రంలో మునిగింది. టీడీపీ ముఖ్యనేతలు కూడా హరి మరణంతో షాక్‌కు గురి అయ్యారు. ప్రస్తుతం అందరూ హైదరాబాద్ చేరుకునే పనిలో ఉన్నారు. ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు కడసారి చూపు కోసం వెళ్తున్నారు.

అయితే.. నిజానికి వీరంతా ఈ సమయానికి ఆళ్లగడ్డలో ఉండాలి. ఎందుకంటే.. అఖిలప్రియ వివాహం జరుగుతోంది కాబట్టి. సీఎం చంద్రబాబు సహా.. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ ఆహ్వానాలు అందాయి. కానీ అంతలోనే హరికృష్ణ మరణవార్త అందరినీ కలిచివేసింది. దీంతో.. వీరెవ్వరూ అఖిలప్రియ వివాహానికి హాజరుకాలేకపోయారు. దీంతో.. అతిథులు ఎవ్వరూ లేకుండా అఖిలప్రియ వివాహం జరిగిపోయింది. 

ప్రముఖులు మాత్రమే కాదు.. మీడియా కూడా అఖిలప్రియ పెళ్లిపై దృష్టి పెట్టకపోవడం గమనార్హం.

 

హరికృష్ణ కార్ యాక్సిడెంట్.. ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే..

వర్షాలకు పాడైన రోడ్డు...అందువల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది : నల్గొండ ఎస్పీ

హైదరాబాద్ కు హరికృష్ణ మృతదేహం....వెంట తారక్, కళ్యాణ్ రామ్,చంద్రబాబు, బాలయ్య

తెలుగుభాషకు ప్రాధాన్యత ఇచ్చిన హరికృష్ణ

loader