Asianet News TeluguAsianet News Telugu

చిన్న పొరపాటుతోనే హరికృష్ణ మృతి

మాజీ ఎంపీ, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ నడుపుతున్న కారు ప్రమాదానికి గురి కావడానికి వాటర్ బాటిల్ కారణంగా తెలుస్తోంది.వాటర్ బాటిల్‌ను తీసుకొనే క్రమంలో  రోడ్డుపై ఉన్న  రాయిని  కారు ఎక్కింది

Reasons behind harikrishna's car accident
Author
Nalgonda, First Published Aug 29, 2018, 1:44 PM IST

నల్గొండ: మాజీ ఎంపీ, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ నడుపుతున్న కారు ప్రమాదానికి గురి కావడానికి వాటర్ బాటిల్ కారణంగా తెలుస్తోంది.వాటర్ బాటిల్‌ను తీసుకొనే క్రమంలో  రోడ్డుపై ఉన్న  రాయిని  కారు ఎక్కింది. అయితే కారు రాయిని ఎక్కిన క్రమంలో  హరికృష్ణ కుడివైపుకు కారును తిప్పాడు. ఈ క్రమంలోనే కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ క్రమంలోనే ఆయన డోరు తెరుచుకొని రోడ్డుపై కిందపడి చనిపోయాడు.

మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ  బుధవారం నాడు  హైద్రాబాద్‌ నుండి  నెల్లూరుకు  ఓ వివాహానికి వెళ్తూ ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. బుధవారం నాడు ఉదయం  నాలుగున్నర గంటల సమయంలో  హైద్రాబాద్ నుండి  నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు. 

కారులో  హరికృష్ణతో పాటు  ఆరికెపూడి వెంకటరావు, శివాజీలు కూడ ఉన్నారు. అరికెపూడి వెంకటరావు కారు బ్యాక్ సీటులో కూర్చొన్నాడు. శివాజీ  మాత్రం  హరికృష్ణ ప్రక్కనే కూర్చున్నాడు.

అన్నెపర్తికి కారు చేరుకోగానే హరికృష్ణ కారును డ్రైవ్ చేస్తూనే  వాటర్ బాటిల్‌ను తీసుకొనే ప్రయత్నం చేశాడు.  అయితే  వాటర్ బాటిల్‌ ను తీసుకొనే క్రమంలో హరికృష్ణ  వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. ఇదే సమయంలో రోడ్డుపైన ఉన్న రాయిని వాహనం ఎక్కింది. దీంతో ప్రమాదం జరగకుండా ఉండేందుకుగాను హరికృష్ణ వాహనాన్ని కుడివైపుకు  తిప్పాడు.

దీంతో రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను కారు ఢీకొట్టింది.ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న  కారును ఢీకొట్టి రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లోకి కారు వెళ్లింది. అయితే కారు మరో కారును ఢీకొట్టి పల్టీలు కొట్టే సమయంలోనే శివాజీ, వెంకటరావు కారు నుండి దిగారు.

డ్రైవింగ్ సీటులో ఉన్న హరికృష్ణ కోసం వెతికితే అతను కన్పించలేదని  వెంకట్రావు, శివాజీలు  ఓ మీడియా ఛానెల్‌కు చెప్పారు.  అయితే  కారు తిరిగే సమయంలోనే కారు డోర్ తెలుచుకొని హరికృష్ణ కిందపడిపోయాడని భావిస్తున్నారు.

అయితే  కారు తిరగబడే సమయంలోనే ప్రమాదవశాత్తు కారు డోరు తెరుచుకొని హరికృష్ణ రోడ్డుపై కిందపడి గాయపడ్డాడని అనుమానిస్తున్నారు. అయితే హరికృష్ణ తలకు బలమైన గాయమైంది. అంతేకాదు రక్తస్రావమైంది. కామినేని ఆసుపత్రికి తీసుకెళ్లారు. హరికృష్ణను బతికించేందుకు ప్రయత్నించినా  ప్రయోజనం లేకుండాపోయింది. 

ఈ వార్తలు చదవండి

కొంపముంచిన నిర్లక్ష్యం: సీటు బెల్ట్ పెట్టుకోక చనిపోయిన ప్రముఖులు వీరే

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నందమూరి హరికృష్ణ కన్నుమూత

బాబుతో హరికృష్ణకు విబేధాలు, ఎందుకంటే?

హరికృష్ణ మృతి: మూడు రోజుల్లోనే పుట్టినరోజు.... ఇంతలోనే దుర్మరణం

నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు

హరికృష్ణ మృతి: సీటు బెల్ట్ పెట్టుకొంటే బతికేవాడు,120 కి.మీ స్పీడ్‌లో కారు

రోడ్డు ప్రమాదాలతో టీడీపీకి దెబ్బ: కీలక నేతల దుర్మరణం

Follow Us:
Download App:
  • android
  • ios