హైద్రాబాద్లో భారీగా డ్రగ్స్ సీజ్, నలుగురి అరెస్ట్: సీవీ ఆనంద్
హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకొన్నామని హైద్రాబాద్ సీపీ ఆనంద్ చెప్పారు. నిందితులను అరెస్ట్ చేశామని సీపీ వివరించారు.
హైదరాబాద్: హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకొన్నామని హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. శుక్రవారం నాడు తన కార్యాలయంలో హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. నలుగురు సభ్యులున్న Drugs సరపరా చేసే ముఠాను అరెస్ట్ చేసినట్టుగా CV Anandచెప్పారు. నిందితుల నుండి 200 గ్రాముల బ్రౌన్ షుగర్ తో పాటు గంజాయిని కూడా స్వాధీనం చేసుకొన్నామన్నారు. ముంబై నుండి Hyderabadకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న విషయాన్ని గుర్తించి పట్టుకున్నామని సీపీ ఆనంద్ వివరించారు. డ్రగ్స్ సరఫరా చేసే నలుగురుని అరెస్ట్ చేశామన్నారు. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు షాహ్జదా సయ్యద్ గతంలో ముంబై డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడని సీపీ తెలిపారు. ఈ కేసులో వైజాగ్ నుంచి గంజాయి హైదరాబాద్ కి తరలిస్తున్న మరో ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశామన్నారు. ట్రిప్ కి 5 వేలు తీసుకొని వైజాగ్ నుంచి హైదరాబాద్ కి గంజాయి తీసుకొస్తున్నారన్నారు.ముంబై నుంచి బ్రౌన్ షుగర్ హైదరాబాద్ కి ఖాద్రి తీసుకొస్తున్నాడని, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వరుసగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయన్నారు.
దక్షిణ భారత దేశంలోని ఎయిర్ పోర్టులైన హైద్రాబాద్, బెంగుళూరు, చెన్నైల నుండి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పోలీసులు చెప్పారు.త్యాన్ జినియ, జమైకా, జాన్సన్ బర్గ్, సౌత్ ఆఫ్రికా దేశాల నుండి ఎక్కువగా డ్రగ్స్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ట్రాన్సిట్ పాయింట్ గా మారిందన్నారు.125 కోట్ల విలువైన డ్రగ్స్ ఇప్పటికే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పట్టుబడ్డాయన్న సీపీ వివరించారు. డ్రగ్స్ తీసుకొచ్చేవారికి ఇక్కడ రిసీవర్స్ ఎవరో తెలియదన్నారు. ఇక్కడికి వచ్చిన డ్రగ్స్ ముంబై, ఢిల్లీ తరలిస్తున్నారన్నారు. సెంట్రల్ ఏజెన్సీలతో కలిసి పని చేస్తే ఈ ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్ ని నిర్మూలించవచ్చన్నారు.
దేశంలో 8 నుంచి 10 కోట్ల డ్రగ్ అనలిస్ట్ లు ఉన్నారని NCB అంచనా నివేదిక ఇచ్చిందన్నారు. గత పదేళ్ళలో దేశంలో 70 శాతం డ్రగ్స్ వాడకం పెరిగినట్లు NCB చెబుతుందన్నారు. నేషనల్ ఎజేన్సీ ద్వారా డ్రగ్స్ కు చెక్ పెడుతున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే జాతీయ స్థాయిలో సమావేశం అవుతామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తామని సీపీ ఆనంద్ వెల్లడించారు.
Shamshabad ఎయిర్ పోర్టులో 14 కిలోల Heroin ను కూడా సీజ్ చేశామన్నారు. ఇతర దేశాల నుండి డ్రగ్స్ తెచ్చి పట్టుబడుతున్న ప్రయాణీకులు ఎంత విచారించినా నోరు మెదపడం లేదన్నారు.ఇంటర్నేషనల్ డ్రగ్ సూత్రధారి Mahesh ఈ దందా నిర్వహిస్తున్నాడని సీవీ ఆనంద్ తెలిపారు. డ్రగ్స్ సరఫరాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు.డ్రగ్స్ తరలింపుపై నిఘా పెట్టామని సీపీ చెప్పారు. ఏపీ నుండి గంజాయిని హైద్రాబాద్ తెచ్చి అమ్ముతున్నారన్నారు. దేశంలో ఉన్న డ్రగ్స్ నార్కోటిక్ అధికారులు డీఆర్ఐ, NCB అధికారులతో సమన్వయం చేసుకొని డ్రగ్స్ మూలాలపై నిఘా పెడుతున్నామన్నారు. బ్రౌన్ షుగర్ నుండి ముంబై నుండి హైద్రాబాద్ కు తరలించి సొమ్ము చేసుకొంటున్నారని ఆయన తెలిపారు.ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటివరకు 98 మంది డరగ్స్ పెడ్లర్లను అరెస్ట్ చేశామన్నారు.377 మంది డ్రగ్స్ సేవించేవారితో పాటు రవాణ చేసే వారిని అరెస్ట్ చేసినట్టుగా సీవీ ఆనంద్ తెలిపారు.డ్రగ్స్ కేసులో జైలుకు వచ్చిన వారిపై నిఘా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.