ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ అసెంబ్లీ స్తానం నుండి  మాజీ మంత్రి  పొన్నాల లక్ష్మయ్య సోమవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు.నామినేషన్ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య కంటతడి పెట్టుకొన్నారు.


జనగామ: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ అసెంబ్లీ స్తానం నుండి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సోమవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు.నామినేషన్ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య కంటతడి పెట్టుకొన్నారు.

జనగామ సీటు విషయంలో పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చుక్కలు చూపించింది. ఈ స్థానం నుండి టీజేఎస్ చీఫ్ కోదండరామ్ పోటీ చేస్తారని ప్రచారం సాగింది. పొత్తులో భాగంగా జనగామ సీటును తొలుత టీజేఎస్ కు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావించింది.

తొలి జాబితాతో పాటు మలి జాబితాలో కూడ పొన్నాల లక్ష్మయ్యకు టికెట్టు లభించలేదు. అయితే టీజేఎస్ చీఫ్ కోదండరామ్ తో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ చర్చించారు.ఆ తర్వాత పొన్నాల లక్ష్మయ్యతో కూడ రాహుల్ చర్చించారు. జనగామ నుండి పోటీ చేసేందుకు కోదండరామ్ ప్రచార రథాన్ని కూడ సిద్దం చేసుకొన్నారు. 

కానీ ఢిల్లీ నుండి వచ్చిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియాతో పాటు పొన్నాల లక్ష్మయ్య నాలుగు రోజుల క్రితం కోదండరామ్ తో చర్చించారు. ఈ చర్చల్లో జనగామ సీటును వదులుకొనేందుకు కోదండరామ్ అంగీకరించారు.

కోదండరామ్ ఒప్పుకోవడంతోనే జనగామలో పొన్నాల లక్ష్మయ్య పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. సోమవారం నాడు పొన్నాల లక్ష్మయ్య నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసిన తర్వాత పొన్నాల లక్ష్మయ్య కంటతడి పెట్టుకొన్నారు.

సీటు కేటాయింపు విషయంలో చోటు చేసుకొన్న పరిణామాలను తలుచుకొని పొన్నాల లక్ష్మయ్య భావోద్వేగానికి గురయ్యారు.ఈ పరిణామాలను తలుచుకొని ఆయన కన్నీళ్లు పెట్టుకొన్నారు. తనను గెలిపిస్తే జనగామ ప్రజల రుణాన్ని తీర్చుకొంటానని పొన్నాల లక్ష్మయ్య హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

జనగామపై ట్విస్ట్: కోదండరామ్‌ చేతిలోనే పొన్నాల భవితవ్యం

ఎట్టకేలకు మర్రి, పొన్నాల సీట్లకు లైన్‌క్లియర్

మహాకూటమికి సెగ: ఢీకొట్టేందుకు రెబెల్స్ కూటమి

రాహుల్ ఇంటి ముందు బండ కార్తీక్ రెడ్డి బైఠాయింపు

రూ. 10 కోట్లు తీసుకొని దానంపై దాసోజుకు టికెట్టు: క్యామ మల్లేష్ సంచలనం

శంషాబాద్ పార్టీ కార్యాలయం వద్ద కార్తీక్ రెడ్డి వీరంగం...

కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

రాజేంద్రనగర్‌లో రెబెల్‌గా సబితా తనయుడు
కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ మూడో జాబితా: పొన్నాలకు క్లియర్, జానా కొడుక్కి టికెట్టు

కోదండరామ్ ఎలా గెలుస్తాడో చెప్పండి: పొన్నాల సవాల్

పొన్నాలకు దక్కని టికెట్ ... కార్యకర్త ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ రెండో జాబితా: తేలని పొన్నాల సీటు

జనగామ నుండి తప్పుకొన్న కోదండరామ్: పొన్నాలకు లైన్‌క్లియర్

జనగామ టికెట్ నాదే..ధీమా వ్యక్తం చేసిన పొన్నాల

కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం

పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్

జనగామ పొన్నాలకే... హైకమాండ్ రహస్య సంకేతాలు: ఆ వర్గానికి షాక్

కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య

జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్

జనగామలో పొన్నాలకు కోడలు చిక్కులు

పొన్నాలకు కాంగ్రెస్ నేతల షాక్

పొన్నాలకు కోమటిరెడ్డి పొ