ఫిల్మ్ ఛాంబర్ ముందు మాధవీలత హల్ చల్.. అరెస్టు (వీడియో)

First Published 18, Apr 2018, 11:43 AM IST
film actress madhavi latha arrest at film chamber
Highlights

పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఆందోళన.. అరెస్టు

ఫిల్మ్ ఛాంబర్ ముందు రోజుకో హీరోయిన్ ఆందోళన చేస్తోంది. మొన్నటికి మొన్న యాంకర్ శ్రీరెడ్డి ఫిల్మ్ ఛాంబర్ ముందుకొచ్చి బట్టలు విప్పేసి అర్థ నగ్న ప్రదర్శన చేసింది. తాజాగా మరో హీరోయిన్ ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగింది. ఆమెతోపాటు మరికొందరు ఫిల్మ్ ఆర్టిస్టులతో కలిసి వచ్చి ఛాంబర్ ముందు ధర్నాకు దిగింది.

శ్రీరెడ్డి ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ మీద అడ్డగోలు విమర్శలు చేయడం, పవన్ తల్లిని దూషించిన నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మాధవీలత ఈ ఆందోళనకు దిగింది. తలకు నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన తెలిపింది మాధవీలత. అయితే ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. మాధవీలత ఆందోళన వీడియో పైన ఉంది చూడండి.

ఆమెతోపాటు రాంకీ అనే సినీ నటుడు కూడా ఆందోళన చేశాడు. పవన్ తల్లిపై కామెంట్స్ కు నిరసనగా మౌనదీక్ష చేశాడు. ఆయనను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

loader