Asianet News TeluguAsianet News Telugu

ఫ్యాన్స్ ఆందోళన: హరీష్ రావుకు కేసిఆర్ మరో షాక్?

భవిష్యత్తులో కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడానికి కేసీఆర్ ప్రణాళిక రచించి అమలు చేస్తున్నట్లు తాజా పరిణామాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో హరీష్ రావు ఏ విధంగానూ పోటీ రాకుండా చేయడానికి అవసరమైన ఎత్తుగడలను ఆయన అనుసరిస్తారని అంటున్నారు.

fans concerned about Harish Rao's political future
Author
Hyderabad, First Published Dec 15, 2018, 1:18 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన తనయుడు కేటీ రామారావుకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టడంతో సిద్ధిపేట శాసనసభ్యుడు హరీష్ రావు అభిమానుల్లో ఆందోళన ప్రారంభమైంది. హరీష్ రావు రాజకీయ భవిష్యత్తుపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

తీవ్రమైన ఆందోళనకు గురైన హరీష్ రావు అభిమానులు శనివారం మినిస్టర్స్ క్వార్టర్స్ కు వెల్లువెత్తారు. మినిస్టర్స్ క్వార్టర్స్ ఆయన అభిమానులతో క్రిక్కిరిసిపోయింది. హరీష్ రావుకు మంత్రి పదవి అయినా దక్కుతుందా లేదా అనే ఆందోళనలో వారున్నారు. 

భవిష్యత్తులో కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడానికి కేసీఆర్ ప్రణాళిక రచించి అమలు చేస్తున్నట్లు తాజా పరిణామాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో హరీష్ రావు ఏ విధంగానూ పోటీ రాకుండా చేయడానికి అవసరమైన ఎత్తుగడలను ఆయన అనుసరిస్తారని అంటున్నారు. మంత్రి పదవి కూడా ఇవ్వకుండా ఆయన స్థాయిని తగ్గించడం ద్వారా కేటీఆర్ కు పోటీని తప్పించాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఒక వ్యక్తికి ఒకే పదవి అని కేసిఆర్ శుక్రవారంనాటి పార్టీ కార్యవర్గ సమావేశంలో చెప్పారు. అందుకు తాను మాత్రమే మినహాయింపు అని కూడా ఆయన చెప్పారు. ఈ క్రమంలో కేటిఆర్ కు మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. అయితే, హరీష్ రావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే, ఈ వాదన బలంగా ముందుకు రావడం లేదు.

పార్టీని పూర్తిగా కుమారుడి చేతుల్లో పెట్టిన కేసీఆర్ తర్వాత పరిణామాలను నిర్దేశించే అధికారాన్ని కూడా ఆయనకు కట్టబెట్టినట్లు భావిస్తున్నారు. నిర్ణాయక పాత్ర నుంచి హరీష్ రావును పక్కకు తొలగించినట్లేనని భావిస్తున్నారు. లోకసభ ఎన్నికల తర్వాత ఫలితాలను బట్టి తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం లభిస్తే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ స్థానంలో కేటిఆర్ ను కూర్చోబెట్టాలనేది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు. 

ఈలోగా హరీష్ రావు నుంచి కేటిఆర్ ఎదురయ్యే సమస్యలను, పోటీని పూర్తిగా నివారించడం కూడా ఆయన వ్యూహంలో భాగం.  ఈ క్రమంలోనే హరీష్ రావును బలహీనపరచడానికి అవసరమైన ఎత్తుగడలు ఆయన వేస్తారని అంటున్నారు. నిజానికి, ఎన్నికలకు ముందే ఆయన ఆ పనిచేయాలని అనుకున్నారు. కానీ, పరిస్థితులు ఎదురు తిరగడంతో తిరిగి హరీష్ రావును చేరదీయాల్సి వచ్చిందని అంటున్నారు. 

కేటీఆర్ కలిసిన సమయంలో హరీష్ రావులో ఏ విధమైన సంతోషం కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ తన నివాసానికి వచ్చిన సమయంలో హరీష్ రావు ఇంట్లో లేరు. హరీష్ రావు వచ్చేవరకు కేటీఆర్ వేచి చూడాల్సి వచ్చింది. ఇద్దరి మధ్య ఏకాంత చర్చలు జరిగిన తర్వాత హరీష్ రావు బయటకు వచ్చి ప్రకటన చేశారు. అలాంటి ప్రకటన చేయాల్సిన అనివార్యతలో హరీష్ రావు పడ్డారని అంటున్నారు. ఈ స్థితిలో కేటిఆర్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తుంటే హరీష్ రావు రాజీ పడుతారా అనేదే ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న.

సంబంధిత వార్తలు

హరీష్ రావు అభిమానులతో మినిస్టర్స్ క్వార్టర్స్ జామ్ (వీడియో)

పారిన కేసీఆర్ పాచిక: భారీ మెజారిటీతో హరీష్ రావుకు షాక్

అతి పెద్ద ప్లాన్ ఇదే: నితీష్ వర్సెస్ కేసీఆర్

టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్‌ హరీష్‌కు ట్రబుల్స్: టీడీపీ, కాంగ్రెస్ మైండ్‌గేమ్

ఆధారాలున్నాయి: హరీష్ పై మరోసారి వంటేరు సంచలనం

పిచ్చి పట్టి మాట్లాడుతున్నాడు: వంటేరుకు హరీష్ కౌంటర్ (వీడియో)

రాహుల్ గాంధీతో హరీష్ టచ్ లో ఉన్నారు: వంటేరు సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్ లో హరీష్ రావు ఇష్యూ: లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

హరీష్ రావును కేసిఆర్ పార్టీ నుంచి గెంటేస్తారు: రేవంత్ రెడ్డి

సేఫ్ జోన్ లోకి కేటీఆర్: హరీష్ రావుపై కేసిఆర్ ప్లాన్ ఇదీ...

భావోద్వేగంతోనే రిట్మైర్మెంట్ కామెంట్ చేశా: మంత్రి హరీష్

హరీష్ టార్గెట్, కేటిఆర్ కు రస్తా: కేసిఆర్ ప్లాన్ ఇదీ...

కారులో హరీష్ రావు ఉక్కిరిబిక్కిరి: సిద్ధిపేటపై కేసిఆర్ కన్ను

హరీష్ వేదాంత ధోరణి: గులాబీ గూడు చెదురుతోందా?

 

Follow Us:
Download App:
  • android
  • ios