టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్‌ హరీష్‌కు ట్రబుల్స్: టీడీపీ, కాంగ్రెస్ మైండ్‌గేమ్

 తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి, టీఆర్ఎస్ కీలక నేత హరీష్‌‌రావు‌పై టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యూహత్మకంగా విమర్శలు  గుప్పిస్తున్నాయి..

congress and tdp mind game: target harish rao

హైదరాబాద్: తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి, టీఆర్ఎస్ కీలక నేత హరీష్‌‌రావు‌పై టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యూహత్మకంగా విమర్శలు  గుప్పిస్తున్నాయి.. హరీష్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ రెండు పార్టీల నేతలు ఎదురుదాడికి దిగారు. మైండ్‌గేమ్‌తో టీఆర్ఎస్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ఈ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్‌గా హరీష్‌రావుకు పేరుంది. పార్టీలో నెలకొన్న అంతర్గత సమస్యలు కానీ, ఎన్నికల్లో  ప్రత్యర్థులను చావు దెబ్బకొట్టి  టీఆర్ఎస్‌కు ఏకపక్ష విజయాన్ని అందించడంలో హరీష్‌రావు వ్యూహరచన చేయడంలో దిట్టగా  పేరుంది.

2014 ఎన్నికల్లో  గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి  కేసీఆర్ గెలుపులో హరీష్‌రావు కీలకంగా వ్యవహరించారు. ఈ దఫా కూడ కేసీఆర్ గెలుపును తన భుజాలపై వేసుకొని హరీష్ ప్రచారం చేస్తున్నారు.మొన్నటి వరకు టీఆర్ఎస్ లోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆ పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారింది.

గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఈ దఫా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కూడ కాంగ్రెస్ పార్టీలో చేరడం   ప్రతాప్ రెడ్డికి కలిసొచ్చే పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గజ్వేల్ నియోజకవర్గంలో హరీష్‌రావు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో హరీష్‌రావు రాహుల్‌తో టచ్‌లో ఉన్నారని ఒంటేరు ప్రతాప్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను  హరీష్ రావు ఖండించారు. ప్రతాప్ రెడ్డి అర్ధరహితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు.

ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత  చంద్రబాబుపై హరీష్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. గజ్వేల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ చంద్రబాబు .. నీ రికార్డులు బయటపెడతాం అంటూ హెచ్చరించారు.  ప్రతాప్ రెడ్డి చంద్రబాబునాయుడు స్క్రిఫ్ట్ ను చదివి విన్పిస్తున్నాడని ఎద్దేవా చేశారు.

హరీష్‌రావు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు  టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్‌లో హరీష్ అనేక అవమానాలు ఎదుర్కొంటూ ఉంటున్నాడని రేవూరి ఆరోపించారు.  సమయం కోసం హరీష్ రావు ఎదురుచూస్తున్నారని... ఎన్నికల్లో  టీఆర్ఎస్‌కు  సరైన సీట్లు రాకపోతే ప్రజా కూటమితో కలిసి సీఎం పీఠాన్ని అధిష్టిస్తారని సంచలన ఆరోపణలు చేశారు.

ఈ ఆరోపణలకు  హరీష్ రావు  కౌంటరిచ్చారు. రేవూరి నాలుక కోస్తానని హెచ్చరించారు. హరీష్‌పై  తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని రేవూరి ప్రకాష్ రెడ్డి  ప్రకటించారు. కేసీఆర్  తన రాజకీయ వారసుడిగా హరీష్‌రావును ప్రకటిస్తే  తాను హరీష్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొంటానని రేవూరి ప్రకటించారు.  గురవారం నాడు కూడ మరోసారి హరీష్‌పై రేవూరి ప్రకాష్ రెడ్డి  మరోసారి  విమర్శలు చేశారు.

హరీష్‌రావు లేకపోతే కేసీఆర్ లేడన్నారు. హరీష్‌ను లక్ష్యంగా చేసుకొని మరోసారి గళం విప్పారు. ఇదిలా ఉంటే రేవూరికి  తోడుగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తాజాగా గళం విప్పారు.

హరీష్‌రావు టీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో హరీష్ రావు చర్చించిన తర్వాత ఆయన టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారని రేవంత్ గుర్తుచేశారు.

టీఆర్ఎస్‌లో నాయకత్వం మార్పిడి కోసం హరీష్ రావు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాడని  హరీష్ కేంద్రంగా రేవంత్  ఆరోపణలు చేశారు. అయితే  వారం రోజులుగా హరీష్‌ను లక్ష్యంగా చేసుకొని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు  విమర్శలు చేస్తున్నారు. 

మైండ్‌గేమ్‌తో హరీష్‌తో పాటు టీఆర్ఎస్‌ను  దెబ్బతీసేందుకు  టీడీపీ, కాంగ్రెస్‌లు ప్రయత్నిస్తున్నాయి. హరీష్‌పై ప్రధానంగా విమర్శలు చేస్తున్న వారిలో  గతంలో టీడీపీలో  ఉండి ఇటీవలనే కాంగ్రెస్‌లో చేరిన ప్రతాప్ రెడ్డి, రేవంత్ రెడ్డి,టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి ఉన్నారు. 

హరీష్‌ను దెబ్బతీస్తే దాని ప్రభావం గజ్వేల్‌తో పాటు టీఆర్ఎస్ క్యాడర్‌పై ఉంటుందని మైండ్‌గేమ్‌కు  ఈ పార్టీలు  ప్రయత్నిస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్‌కు ట్రబుల్స్ క్రియేట్ చేయడం కోసం మైండ్‌గేమ్‌కు విపక్షాలు  శ్రీకారం చుట్టాయి.

అయితే  హరీష్‌పై విపక్షాలు చేస్తున్న విమర్శలను కేటీఆర్, ఇతర టీఆర్ఎస్‌ నేతలు కొట్టిపారేస్తున్నారు. కానీ, ఆధారాలున్నాయంటూ ఒంటేరు చేస్తున్న  ప్రకటనలు కొంత గందరగోళానికి దారి తీస్తున్నాయి.

నెల రోజుల క్రితం రాజకీయ సన్యాసం చేస్తానని హరీష్ రావు చేసిన ప్రకటననలను కూడ ప్రత్యర్థులు గుర్తుచేస్తున్నారు. అయితే విపక్షాల మైండ్‌గేమ్‌ను తిప్పికొట్టి ట్రబుల్ షూటర్ ట్రబుల్స్ నుండి బయటకు వస్తారా... ఈ మైండ్ గేమ్ ఏ మేరకు విపక్షాలు కలిసి వస్తోందనేది ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.

సంబంధిత వార్తలు

ఆధారాలున్నాయి: హరీష్ పై మరోసారి వంటేరు సంచలనం

పిచ్చి పట్టి మాట్లాడుతున్నాడు: వంటేరుకు హరీష్ కౌంటర్ (వీడియో)

రాహుల్ గాంధీతో హరీష్ టచ్ లో ఉన్నారు: వంటేరు సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్ లో హరీష్ రావు ఇష్యూ: లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

హరీష్ రావును కేసిఆర్ పార్టీ నుంచి గెంటేస్తారు: రేవంత్ రెడ్డి

సేఫ్ జోన్ లోకి కేటీఆర్: హరీష్ రావుపై కేసిఆర్ ప్లాన్ ఇదీ...

భావోద్వేగంతోనే రిట్మైర్మెంట్ కామెంట్ చేశా: మంత్రి హరీష్

హరీష్ టార్గెట్, కేటిఆర్ కు రస్తా: కేసిఆర్ ప్లాన్ ఇదీ...

కారులో హరీష్ రావు ఉక్కిరిబిక్కిరి: సిద్ధిపేటపై కేసిఆర్ కన్ను

హరీష్ వేదాంత ధోరణి: గులాబీ గూడు చెదురుతోందా?

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios