మర్డర్ మిస్టరీలో ట్విస్ట్... భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఒక లవర్ తో మరో లవర్ హత్య..
హైదరాబాద్ లో పదిరోజుల క్రితం జరిగిన మర్డర్ మిస్టరీలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ భర్తకు తెలియకుండా ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఒకరితో మరొకరని మర్డర్ చేయించింది ఓ కిలేడీ.
హైదరాబాద్ : కట్టుకున్న భర్తను ఏం మార్చి మరో ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకుని.. వారిలో ఒకరి ప్రాణాలు తీసిన ఓ మహిళ నిజస్వరూపం బయట పడింది. పది రోజుల కిందట హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన మర్డర్ మిస్టరీ లో వెలుగుచూసిన తాజా షాకింగ్ న్యూస్ ఇది. మే 4వ తేది అర్ధరాత్రి మీర్‌పేటలోని నంది హిల్స్ చౌరస్తాలో దాడికి గురై చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత మృతి చెందిన యశ్ కుమార్ కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
విచారణలో వారి నుంచి షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. విక్రమ్ రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకున్న శ్వేతారెడ్డి... ఫేస్బుక్లో పరిచయమైన యశ్ కుమార్ తో నాలుగేళ్ల కిందట రిలేషన్ పెట్టుకుంది. తర్వాత కృష్ణాజిల్లాలో ఓ ప్రైవేట్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ కొంగళ్ల అశోక్ తో కూడా అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో న్యూడ్ ఫోటోలు బయటపెడతానని హెచ్చరించిన యశ్ కుమార్ ని వదిలించుకోవాలని ప్లాన్ చేసి.. ఆ స్కెచ్ లో సెకండ్ బాయ్ ఫ్రెండ్ అశోక్ ని వాడేసుకుంది.
బైక్ మీద వెళ్తున్న యశ్ కుమార్ ని సుత్తితో దారుణంగా కొట్టి పారిపోయాడు అశోక్. ఆ దారిన వెళుతున్న కొందరు యశ్ కుమార్ ను కాపాడి ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేకుండా పోయింది. అతను రెండు రోజుల తర్వాత చనిపోయాడు. స్పాట్ లో స్మార్ట్ ఫోన్ కాల్ డేటాను ట్రేస్ చేసి.. అసలు మిస్టరీని ఛేదించారు పోలీసులు. భర్తకు తెలియకుండా ఒక బాయ్ ఫ్రెండ్ సాయంతో మరో బాయ్ ఫ్రెండ్ ను చంపించిన శ్వేతారెడ్డి ఇప్పుడు ఊచలు లెక్కపెడుతోంది.
ఇదిలా ఉండగా,
extramarital affairలు పచ్చని కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. పెద్దలను, పిల్లలను రోడ్డున పడేస్తున్నాయి. పెళ్లి అయినప్పటికీ మరో వ్యక్తితో వివాహేతర సంబంధాలను కొనసాగిస్తూ.. ఏకంగా భర్త అని చెప్పి ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టిందో మహిళ. ఈ వ్యవహారం హైదరాబాద్ లో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని రహమత్ నగర్ లో ఆర్మీ జవాన్ ఫ్యామిలీ నివాసం ఉంటుంది. కాగా, జవాన్ భార్య.. జ్ఞానేశ్వర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతే కాకుండా ఏకంగా ప్రియుడినే తన భర్త అని చెప్పి ఇల్లు అద్దెకు తీసుకుని రాసలీలలు కొనసాగిస్తోంది.
ఇదిలా కొనసాగుతుండగా అకస్మాత్తుగా ఇంటికి వచ్చిన ఆర్మీ జవాన్ ఏకాంతంగా ఉన్న భార్య, ప్రియుడు జ్ఞానేశ్వర్ ను చూసి ఒక్క సారిగా షాక్ అయ్యాడు. ఆ తర్వాత షాక్ నుంచి తేరుకుని.. ఇంట్లో నుంచి బయటకు వచ్చి.. వారిద్దరిని ఇంట్లోనే ఉంచి తాళం వేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో జవాన్ ఇంటికి వచ్చిన పోలీసులు.. తాళం తీసి వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, జవాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇలా ఉండగా తన భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని జవాన్ తెలిపాడు. ఇద్దరు పిల్లలు ఉన్నా.. ఆమె మరో వ్యక్తితో ఇలా వివాహేతర సంబంధం పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించాడు. ఆమె తనను నమ్మించి మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు.