రంగారెడ్డి జిల్లాలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్: 480 చాక్లెట్లు సీజ్
రంగారెడ్డి జిల్లాలో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు గురువారంనాడు అరెస్ట్ చేశారు. షాద్ నగర్, నందిగామల్లోని కిరాణా దుకాణాల్లో గంజాయి చాక్లెట్లను విక్రియస్తున్నారని సమాచారం తెలుసుకొని ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కిరాణా దుకాణాల్లో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నారు. ఈ విషయమై కచ్చితమైన సమాచారం ఆధారంగా ఎక్సైజ్ అధికారులు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న కిరాణాదుకాణంపై దాడి చేసి చాక్లెట్లను సీజ్ చేశారు. షాద్ నగర్ తో పాటు నందిగామలో కూడా గంజాయి చాక్లెట్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.షాద్‌నగర్, నందిగామల్లో సుమారు 480 గంజాయి చాక్లెట్లను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు.
గంజాయి చాక్లెట్లను సరఫరా చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో గంజాయి, డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడుతున్న కేసులు నమోదౌతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా నుండి ఛత్తీస్ ఘడ్ కు గంజాయి తరలిస్తున్న ముఠాను హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 2.80 కోట్ల విలువైప 1300 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 6న చోటు చేసుకుంది. ఈ ఏడాది జూలై 4న హైద్రాబాద్ సంజీవరెడ్డినగర్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.