Asianet News TeluguAsianet News Telugu

కేటీఆర్.. కల్వకుంట్ల అజయ్.. చిట్టి నాయుడు

  • కేకే, డిఎస్ కూడా లోఫర్లేనా?
  • కేటిఆర్ ఒక వైట్ కాలర్ దొంగ
  • కేటిఆర్ పేరు కారుకూతల రామారావు
  • సోనియా కాళ్లు మొక్కినప్పుడు లోఫర్ పార్టీ కాదా?
congress sravan dasoju fire on ktr

తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటిఆర్ మీద కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శవన్ ఫైర్ అయ్యారు. గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో దాసోజు మాట్లాడారు. ఏమన్నారో చదవండి.

కేటీఆర్ కు పైత్యం పెరిగి సినిమాలో చిట్టినాయుడులా మాట్లాడుతున్నారు. పిసిసి చీఫ్ ఉత్తమ్ మీద మిడతలా ఎగిరి పడుతున్నారు. జాగ్రత్త కేటిఆర్ మాడిపోతారు. కాంగ్రెస్ ను లోఫర్ అన్న మాటలు విత్ డ్రా చేసుకో. కేటీఆర్ నిజమైన వైట్ కాలర్ దొంగ. టిఆర్ఎస్ అంటేనే బ్రోకర్ల రాష్ట్ర సమితి.

తెలంగాణ ను మోడీ కించపరిస్తే కేటీఆర్ కు కనబడదా ? టిఆర్ఎస్ -మోడీల రహస్య ఎజెండా ఏంటో బయటపెట్టాలి. కేటీఆర్ ఫ్రస్టేషన్ తోనే కాంగ్రెస్ ను తిడుతున్నారు. కేంద్రం నుండి నిధులు సాధించలేని దద్దమ్మ కేసీఆర్. ధూషిస్తే కేసులు పెడతామంటున్న కేసీఆర్. కాంగ్రెస్ ను లోఫర్ అన్న కేటీఆర్ పై వెంటనే కేసు పెట్టి జైల్లో పెట్టాలి.

కేటీఆర్ ది ఉత్తమ్ స్థాయి కానే కాదు ..కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ఎవరు? తెలంగాణకు ఐటీఐఆర్ ను తీసుకురాలేని సన్నాసి కేటీఆర్. నమ్మినోడిని తడిగుడ్డ తో గొంతులు కోసే నైజం కేటీఆర్ ది. ఉద్యమకారుల ఉసురు కచ్చితంగా టిఆర్ఎస్ కు తగులుతుంది. నీతి లేని ,రాజకీయ వ్యభిచార సమితి ..టిఆర్ఎస్.

కేటీఆర్ అసలు పేరు కల్వకుంట్ల కారు కూతల రామారావ్. కాంగ్రెస్ లోఫర్ ఐతే ..అదే పార్టీలో పుట్టిన కేసీఆర్ కూడా లోఫరేనా ? దుబాయ్ కి హ్యూమన్ ట్రాఫికింగ్ ,దొంగ నోట్ల ను మార్చిన చరిత్ర కేసీఆర్ కు ఉన్నది.

సోనియా కాళ్ళు మొక్కినప్పుడు ,రాహుల్ ను కేసీఆర్ కౌగిలించుకున్నప్పుడు కాంగ్రెస్ లోఫర్ పార్టీ గా కనబడలేదా ? కేటీఆర్ శైలి తెలంగాణకు ప్రమాదకరం. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులను రెచ్చగొట్టి ఆత్మహత్యలకు ఉసిగొలిపిన నరహంతక చరిత్ర కేసీఆర్ ది. అధికారంలో వచ్చాక టిఆర్ఎస్ నేతల దాడులు చూస్తే ..కేటీఆర్ ముఖం మోకాల్లో దాచుకోవాలి.

 టీఆరెస్ లో చేరిన డీఎస్ ,కేకే ..కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీ లు లోఫర్ లేనా ? కేటీఆర్ చెప్పాలి. ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా టీఆరెస్ లో చేరిన కాంగ్రెస్ నేతలు బయటికి రావాలి. కేటీఆర్ పొట్టవిప్పితే అన్ని పురుగులే. మిషన్ భగీరథ అవినీతిలో ఉన్న కేటీఆర్  ను జైళ్లో పెట్టస్తాం. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ ప్రాధాన్యత లేకపోవడం పై చర్చను పక్కదోవ పట్టిస్తున్నారు 

Follow Us:
Download App:
  • android
  • ios