MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Weather Update: తీవ్రమైన ఈదురుగాలులు.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాలకు భారీ వర్షల హెచ్చరిక

Weather Update: తీవ్రమైన ఈదురుగాలులు.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాలకు భారీ వర్షల హెచ్చరిక

Weather Update: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, ఈదురుగాలులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 30 2026, 08:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు
Image Credit : Gemini

ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు

బంగాళాఖాతంలో మరోసారి వాతావరణం పూర్తిగా మారిపోయింది. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్-ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలలో బలమైన అల్పపీడన వ్యవస్థ ఏర్పడింది. ఇది రాబోయే 24 నుంచి 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది.

దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని ఐఎండీ తెలిపింది. తీవ్రమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏపీలో తుపాను తరహా వాతావరణం.. సముద్రం అల్లకల్లోలం
Image Credit : Gemini

ఏపీలో తుపాను తరహా వాతావరణం.. సముద్రం అల్లకల్లోలం

అల్పపీడనం ఎఫెక్ట్ వల్ల కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా మారింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు వంటి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడనున్నాయి.

తీరం వెంట గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముంది. అలాగే, సముద్రంలో రాకాసి అలలు ఎగసిపడే ప్రమాదం ఉంది. దీంతో విపత్తుల నిర్వహణ సంస్థ అత్యవసర అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని, ఇప్పటికే వేట కోసం వెళ్లిన వాళ్లు వెను వెంటనే ఒడ్డుకు తిరిగి రావాలని వార్నింగ్ ఇచ్చారు.

35
తెలంగాణను కమ్మేసిన మబ్బులు: ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్
Image Credit : Chatgpt

తెలంగాణను కమ్మేసిన మబ్బులు: ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్

తెలంగాణ అంతటా మబ్బులు కమ్మేసి వాతావరణం చాలా కూల్ అయింది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల జిల్లాలకు వర్ష సూచన జారీ అయింది.

వీటితో పాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో చెదురుమదురు జల్లులు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 60 కిమీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

45
హైదరాబాద్ వాతావరణం ఎలా ఉందంటే
Image Credit : Getty

హైదరాబాద్ వాతావరణం ఎలా ఉందంటే

హైదరాబాద్ నగర విషయానికి వస్తే, ఆదివారం ఉదయం నుంచే వాతావరణం కూల్‌గా మారిపోయింది. ఆకాశమంతా మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి లోపు నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన ఉరుముల జల్లులు పడే అవకాశముంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 25°C నుంచి 27°C, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20°C నుంచి 22°C మధ్య నమోదు కావచ్చు. గాలిలో తేమ 70 శాతానికి పైగా ఉండటంతో చల్లగా వెదర్ ఉండనుంది.

55
దేశవ్యాప్తంగా వెదర్ ఎలా ఉందంటే?
Image Credit : Asianet News

దేశవ్యాప్తంగా వెదర్ ఎలా ఉందంటే?

తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో అల్పపీడన ప్రభావం ఉంటే, దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఆదివారం గరిష్ఠంగా 36 డిగ్రీలు, కనిష్ఠంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఆకాశం పాక్షికంగా మబ్బు పట్టి ఉంది. ఢిల్లీలో ప్రస్తుతానికి ఎలాంటి డైరెక్ట్ వార్నింగ్స్ లేకపోయినా, సెప్టెంబర్ 1 నుంచి వాతావరణం చల్లబడి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. అక్కడ గాలి నాణ్యత 130 పాయింట్లతో మధ్యస్థాయిలో ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
అమరావతి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నిర్మలా సీతారామన్ ఇంటి ముందు రాసున్న.. ఈ శ్లోకం అర్థం ఏంటో తెలుసా.?
Recommended image2
ఇక‌పై అమెరికా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో అమెరికా ప్ర‌భుత్వ వ‌ర్సిటీ వ‌స్తోంది
Recommended image3
Vegetables Price : హైదరాబాద్ లో టమాటా, ఉల్లి ధరలు ఎలా ఉన్నాయి? ఈ కూరగాయ కిలో రూ.100?
Related Stories
Recommended image1
Nepal Floods: నేపాల్ వరదల్లో 3000 మంది మిస్సింగ్.. గండక్ నది ఒడ్డున మృతదేహాల కలకలం
Recommended image2
Agriculture: లక్షల ఎకరాల భూములు కొంటున్న మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ బాస్‌లు.. అసలు ప్లాన్ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved