హైదరాబాద్: పవన్‌తో సెల్ఫీ దిగాల్సిన అవసరం తనకు  లేదని  ఎఐసీసీ కార్యదర్శి  సంపత్ కుమార్ చెప్పారు. తనతోనే సెల్ఫీలు దిగేవారు చాలా మంది ఉన్నారన్నారు.

శుక్రవారంనాడు అసెంబ్లీ లాబీల్లో సంపత్ కుమార్ మీడియాతో మాట్లాడారు. యురేనియంపై ఏబీసీడీలు తెలియకుండానే తాను ఢిల్లీకి వెళ్లి పోరాటం చేశానా అని ఆయన ప్రశ్నించారు. తాను పార్టీ సమావేశాల్లోనే ఈ విషయమై మాట్లాడినట్టుగా ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డి మాదిరిగా తాను మీడియా ముందకు వచ్చి మాట్లాడలేదని ఆయన తెలిపారు.

రేవంత్ రెడ్డి తనకు అన్న లాంటి వాడని... ఆయనే తనపై  విమర్శలు చేయడం బాధ కల్గించిందన్నారు. కాంగ్రెస్ ఎంపీగా ఉంటూ పవన్ కు రిపోర్టు ఇవ్వడమేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నించడమేనా తన నేరమా అని  ఆయన అన్నారు.

జనసేన బ్యానర్ కింద ప్రోగ్రాం చేయడమేమిటని తాను అడిగానని ఆయన గుర్తు చేసుకొన్నారు. జనసేన బ్యానర్ కింద జరిగే సమావేశానికి తాను వెళ్లినట్టుగా వెళ్లే వరకు కూడ తెలియదన్నారు.

పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని తాను ఎవరిని కోరలేదన్నారు. కానీ ఎఐసీసీ నుండి  తన బయోడేటా అడిగినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. పీసీసీ చీఫ్ పదవికి దామోదర రాజనర్సింహ అర్హుడన్నారు.

సంబంధిత వార్తలు

హుజూర్ నగర్ చిచ్చు: రేవంత్ రెడ్డిపై విహెచ్ ఫైర్

హుజూర్ నగర్ బై ఎలక్షన్ ట్విస్ట్: పీసీసీ చీఫ్ ఉత్తమ్ కు ఎంపీ కోమటిరెడ్డి మద్దతు

రేవంత్ రెడ్డికి కాంగ్రెసులో చుక్కలు: ఉత్తమ్ కు బాసట

కారణమిదేనా?:హుజూర్‌నగర్‌పై రేవంత్ వ్యాఖ్యలు
ఈ మధ్యే వచ్చినోళ్ల సలహాలు అక్కర్లేదు: రేవంత్‌పై కోమటిరెడ్డి వ్యాఖ్యలు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఈ మధ్యే వచ్చినోళ్ల సలహాలు అక్కర్లేదు: రేవంత్‌పై కోమటిరెడ్డి వ్యాఖ్యలు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: కాంగ్రెసు అభ్యర్థి పద్మావతి, ఉత్తమ్ ప్రకటన

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: ఉత్తమ్ పద్మావతికి రేవంత్ రెడ్డి నిరసన సెగ

నాలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికలకు నోటిఫికేషన్: లిస్ట్‌లో లేని హుజూర్‌నగర్‌

హుజూర్‌నగర్‌ నుండి పోటీకి ఉత్తమ్ సతీమణి నో

హుజూర్‌నగర్: ఉత్తమ్ సీనియారిటీకి లోకల్ ట్విస్ట్

టీఆర్ఎస్ లో అసంతృప్తి... ఉత్తమ్ షాకింగ్ కామెంట్స్