Asianet News TeluguAsianet News Telugu

ఈ మధ్యే వచ్చినోళ్ల సలహాలు అక్కర్లేదు: రేవంత్‌పై కోమటిరెడ్డి వ్యాఖ్యలు

మా జిల్లా విషయంలో పక్క జిల్లా నేతలు, ఈ మధ్యే పార్టీలోకి వచ్చిన వాళ్ల సలహాలు తమకు అవసరం లేదని వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి చెబుతున్న అభ్యర్ధి పేరు నాకే కాదు.. ఆ ప్రాంత నేత జానారెడ్డికి కూడా తెలియదన్నారు

bongir mp Komati Reddy Venkat Reddy sensational Comments-on-Revanth-Reddy
Author
Hyderabad, First Published Sep 19, 2019, 7:07 PM IST

మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై.. కాంగ్రెస్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన హుజూర్‌నగర్‌లో ఎవరిని అభ్యర్ధిగా పెట్టాలో మాకు తెలియదంటూ మండిపడ్డారు.

మా జిల్లా విషయంలో పక్క జిల్లా నేతలు, ఈ మధ్యే పార్టీలోకి వచ్చిన వాళ్ల సలహాలు తమకు అవసరం లేదని వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి చెబుతున్న అభ్యర్ధి పేరు నాకే కాదు.. ఆ ప్రాంత నేత జానారెడ్డికి కూడా తెలియదన్నారు.

హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ పద్మావతిని నిలబెట్టి గెలిపించుకుంటామని, ఆమె అయితేనే సరైన అభ్యర్ధి అని కోమటిరెడ్డి వెల్లడించారు. 30 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నామని.. తమను కాదని కొత్త అభ్యర్ధిని పెడతారా అని వెంకటరెడ్డి ప్రశ్నించారు.

జానారెడ్డి, ఉత్తమ్, తాను ఒక్కటయ్యామని.. గతంలో కొన్ని అభిప్రాయ భేదాలు ఉండేవని, కానీ ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయని కోమటిరెడ్డి పేర్కొన్నారు. అలాగే తాను పీసీసీ చీఫ్ రేసులో లేనని వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

కాగా.. బుధవారం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి హుజూర్‌నగర్ అభ్యర్ధిగా శ్యామల కిరణ్ రెడ్డిని ప్రతిపాదించడంతో పాటు ఉత్తమ్  కుమార్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: ఉత్తమ్ పద్మావతికి రేవంత్ రెడ్డి నిరసన సెగ

నాలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికలకు నోటిఫికేషన్: లిస్ట్‌లో లేని హుజూర్‌నగర్‌

హుజూర్‌నగర్‌ నుండి పోటీకి ఉత్తమ్ సతీమణి నో

హుజూర్‌నగర్: ఉత్తమ్ సీనియారిటీకి లోకల్ ట్విస్ట్

టీఆర్ఎస్ లో అసంతృప్తి... ఉత్తమ్ షాకింగ్ కామెంట్స్

Follow Us:
Download App:
  • android
  • ios